Site icon HashtagU Telugu

Tender Coconut: లేత కొబ్బరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?

Tender Coconut

Tender Coconut

మామూలుగా మనం ఇంట్లో దేవుడికి టెంకాయ కొట్టినప్పుడు లేదంటే, టెంకాయ నీళ్ళు తాగినప్పుడు అందులో కొబ్బరి తింటూ ఉంటాం. కొబ్బరి తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే చాలామంది అదే పనిగా పచ్చికొబ్బరి తింటూ ఉంటారు. ముఖ్యంగా మనం బయట ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదంటే వేసవికాలంలో టెంకాయ తాగినప్పుడు అందులో మనకు లేత కొబ్బరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొందరు లేదు కొబ్బరిని అదేపనిగా కొట్టించుకొని మరి తింటే మరికొందరు టెంకాయ నీరు తాగేసి టెంకాయను పడేస్తూ ఉంటారు.

కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే లేత కొబ్బరి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లేత కొబ్బరిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. ఇందులో ఫైబర్, మాంగనీస్, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్, లారిక్ యాసిడ్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లేత కొబ్బరిలో అధికంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌.. పేగుల కదలికను ప్రోత్సహిస్తుంది. తద్వారా, జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. లేత కొబ్బరి గట్‌ బ్యాక్టీరియను బలంగా మారుస్తుంది, గట్‌ మైక్రోబ్స్‌ను పెంచుతుంది.

దీంతో ఎసిడిటీ, గ్యాస్‌, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. లేత కొబ్బరిలోని కొవ్వు విటమిన్‌ ఏ, విటమిన్ కె, విటమిన్ డి , విటమిన్‌ ఇ వంటి కరిగే పోషకాలు సమర్థవంతంగా గ్రహిస్తుంది. లేత కొబ్బరిలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి గుండె సమస్యల ముప్పు పెంచే చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ స్థాయిలను తగ్గిస్తాయి. లేత కొబ్బరి తింటే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేత కొబ్బరిలోని లారిక్ యాసిడ్ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది, గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది.

లేత కొబ్బరిలోని మంచి కొవ్వు బరువు తగ్గించడంతో పాటు, బెల్లీ ఫ్యాట్‌ను కరిగిస్తుంది. లేత కొబ్బరిలో ఫైబర్‌ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని నిండుగా ఉంచుతుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఒక కప్పు లేత కొబ్బరిలో 3 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి కండరాలను పెంచుతుంది. అధిక బరువుతో బాధపడే వారు వారి డైట్‌లో లేత కొబ్బరి చేర్చుకుంటే మంచిది. 100 గ్రాముల తేత కొబ్బరిని రోజూ తీసుకున్న 80 మంది ఆరోగ్యవంతులలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. లేత కొబ్బరి టైప్‌ -2 డయాబెటిస్‌ ముప్పును తగ్గిస్తుంది.