Heart Attacks : చలికాలంలో ఉదయంపూట గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ..ఎందుకో తెలుసా..?

  • Written By:
  • Updated On - November 28, 2022 / 12:38 PM IST

చలికాలంలో మొదలైంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలు వణికిపోతున్నారు. చలికాలంలో చలి ఒక్కటే కాదు…ఎన్నో వ్యాధులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి .ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులున్న వారికి సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. చలి ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రవాహాన్ని పరిమితం అవుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి కలుగుతుంది. చలికాలంలో దాదాపు 20 నుంచి 30శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే చలికాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార మార్పులతోపాటు వైద్యులు సూచించిన చికిత్సను క్రమం తప్పకుండా అనుసరించాలి.

గుండెపోటుకు కారణాలు
వాయుకాలుష్యం
పొగ, వాయు కాలుష్యం వల్ల శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువ అవుతాయి. అంటువ్యాధులు ప్రభలుతాయి. మీ కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లయితే శ్వాససమస్యలతో బాధపడుతుంటే…వారిని కాలుష్యానికి దూరంగా ఉంచాలి. ఎందుకంటే పొగ వారి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

విటమిన్ డి లోపం
శీతాకాలంలో పొగమంచు వల్ల సూర్యకాంతి కాస్త తగ్గుతుంది. మన శరీరానికి డి విటమిన్ చాలా ముఖ్యం. ఇది గుండె లో మచ్చ కణజాలం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. చలికాలంలో డి విటమిన్ తక్కువస్థాయి వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటంది.

వెచ్చని బట్టలు ధరించాలి
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ కూడా వెచ్చగా ఉండే దుస్తువులు ధరించాలి. ఉన్ని,కోటు,స్వెట్టర్ , దుప్పటి మొదలైనవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. శరీరానికి ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి.

ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.
చలికాలంలో ఎక్కువగా చమట రాదు. కాబట్టి నీరు , ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. పండ్లు కూరగాయలు ఎక్కువగా తినాలి. సూప్ ఎక్కువగా తాగాలి

వ్యాయామం పరిమితంగా ఉండాలి
గుండె సంబంధిత ఉద్యోగులు వ్యాయాయం తప్పకుండా చేయాలి. కానీ మీ వైద్యుని సలహా మేరకు చేయాలి. చలిగాలులు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకుండా ఉండాలి. ఇంట్లో వ్యాయామం చేయాలి.

వైద్యుల ప్రిస్క్రిప్షన్ అనుసరించాలి
క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. వైద్యులు ఇచ్చిన మందులు మాత్రమే వాడాలి.