పనస పండుగ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మనకు చాలా వరకు ఈ ఫ్రూట్స్ ఏడాదిలో సగం వరకు లభిస్తూ ఉంటాయి. దీనినే ఇంగ్లీషులో జాక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి సమృద్ధిగా అందిస్తుంది. మధుమేహం ఉన్నవారు తినగలిగే పండ్ల జాబితాలో ఇదీ కూడా ఒకటి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఈ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ పండు మాత్రమే కాదు ఇందులోని విత్తనాల వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విత్తనాల్లో థయామిన్, రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది.
కళ్ళు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పిక్కల్లో జింక్, ఇనుము, కాల్షియం, రాగి, పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. పనస విత్తనాలలోని ఫైబర్ పేగు కదలికలు సరి చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల అభివృద్ధిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే వీటిని పడేయకుండ తినాలి. ఈ గింజల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్త నాళాలని సడలించడం ద్వారా రక్తపోటుని తగ్గిస్తుంది. గుండె, రక్త ప్రసరణ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బలమైన ఎముకల కోసం కాల్షియంతో పాటు అనేక ఇతర పోషకాలు అవసరం. మెగ్నీషియం అధికంగా ఉండే జాక్ ఫ్రూట్ విత్తనాలు కాల్షియం శోషణకి దోహదపడతాయి.
ఎముకల్ని బలోపేతం చేస్తాయి. మహిళల్లో ఎక్కువగా రక్తహీనత సమస్య కనిపిస్తుంది. జాక్ ఫ్రూట్ గింజల నుంచి వచ్చే ఐరన్ ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇనుము తగినంత తీసుకోవడం వల్ల శరీరం అంతటా ఆక్సిజన్ పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తే రక్తహీనతని నివారించడంలో సహాయపడుతుంది. అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా జాక్ ఫ్రూట్ గింజలు బలమైన శక్తి వనరుగా పని చేస్తాయి. వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. ఆహారాన్ని శక్తిగా మార్చి జీవక్రియని ప్రోత్సహించేందుకు దోహదపడతాయి. అయితే వండుకుని తింటేనే. పచ్చివి తినడం వల్ల సమస్యలు రావచ్చు. మందులను శోషించకునే శక్తి శరీరానికి తగ్గిపోవచ్చు.