కాన్పూర్‌లో క్రికెట్ గ్రౌండ్‌లోనడుస్తుండగా ఒక యువకుడు గుండెపోటుతో(Sudden Heart Attacks) చనిపోయాడు..
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ సెక్యూరిటీ గార్డు భోజనం చేస్తుండగా గుండెపోటుతో చనిపోయాడు..
మహారాష్ట్రలోని నాందేడ్‌లో పెళ్లి వేడుకలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో చనిపోయాడు..
సడెన్ హార్ట్ ఎటాక్స్ దడ పుట్టిస్తున్నాయి.
ఎప్పుడు .. ఎలా.. హార్ట్ ఎటాక్ వస్తుందో అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి.
డ్యాన్స్ చేస్తున్నప్పుడు.. వ్యాయామం చేస్తున్నప్పుడు.. ఈత కొట్టేటప్పుడు సడెన్ హార్ట్ ఎటాక్స్(Sudden Heart Attacks) బారినపడిన ఎంతోమందిని మనం చూశాం..
ఇలా చనిపోయిన వాళ్లలో వీఐపీలు, డాక్టర్లు, యాక్టర్లు కూడా ఉన్నారు..
ఈ తరుణంలో అలాంటి మిస్టీరియస్ సడెన్ హార్ట్ ఎటాక్ లపై రీసెర్చ్ చేసేందుకు IIT కాన్పూర్ రెడీ అవుతోంది.
Also read : Monday Heart Attack: సోమవారంలోనే అధిక గుండెపోటు ప్రమాదాలు
ఆకస్మిక గుండెపోటులపై IIT కాన్పూర్ ఒక సమగ్ర పరిశోధనా ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సంస్థ ఇతర ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి రీసెర్చ్ యాక్టివిటీ చేయనుంది. గుండెపోటులపై లోతైన అవగాహన కలిగిన ప్రపంచ ప్రఖ్యాత పరిశోధకులను ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం చేయనుంది. IIT కాన్పూర్‌లో ఉన్న గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ప్రాజెక్టును నిర్వహించనుంది. శారీరక శ్రమ చేసే సమయంలో గుండెపోటు రావడానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నించనుంది.
Also read : Dog Saved Person: గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడిన శునకం.. ఎలానో తెలుసా..?
గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేసే ఒక వైద్య వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ సిస్టమ్ అధునాతన MRI, ECG స్కాన్‌ల డేటా ఆధారంగా కార్డియో ఎలక్ట్రోఫిజియాలజీ సిమ్యులేటర్‌ని ఉపయోగిస్తుంది. IIT కాన్పూర్ తో ఈ ప్రాజెక్టులో పాల్గొననున్న సంస్థల జాబితాలో సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI) కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇంజనీరింగ్ లేదా ఏదైనా శాస్త్రీయ విభాగంలో PhD కలిగిన వైద్యులు, శాస్త్రవేత్తలను ఎంపిక చేయనున్నారు. జూన్ 22 నాటికి రీసెర్చ్ టీమ్ ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది.