Site icon HashtagU Telugu

Tea: ఇది మీకు తెలుసా? టీ తాగితే బరువు తగ్గవచ్చా.. అదెలా అంటే!

Tea

Tea

మామూలుగా మనలో చాలా మందికి ఉదయం దగ్గర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు రెండు లేదా మూడుసార్లు అయినా కాఫీ టీ వంటివి తాగుతూ ఉంటారు. రోజులో కనీసం ఒక్కసారైనా కాఫీ లేదా టీ తాగనిదే చాలా మందికి రోజు కూడా గడవదు. అందుకే ప్రతిరోజు టీ కాఫీ తాగుతూ ఉంటారు. అయితే మనం తాగే టీ తో ఈజీగా బరువు తగ్గవచ్చు అని నీకు తెలుసా? అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు రోజుకి రెండు, మూడు సార్లు టీ తాగితే కేలరీలు మరింత పెరిగిపోయే అవకాశం ఉందట.

అందుకే చాలా మంది డైటీషియన్లు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టీ తాగవద్దని సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది టీ తాగడమే కాకుండా దానితో పాటు కొన్ని స్నాక్స్ కూడా తింటూ ఉంటారు. ఫలితంగా బరువు పెరుగుతారట. అయితే నిజానికి ఒక కప్పు పాలు మీ బరువు పెంచవు. కానీ దానితో వేయించినవి తినకుండా హెల్తీ స్నాక్స్ తీసుకోవాలట. ఇలా స్పెషల్ గా సిద్ధం చేసిన టీ బరువు తగ్గడానికి రోజుకు ఒక్కసారే టీ తాగాలట. దానితో ఖఖ్రా, మఖానా, కాల్చిన భేల్ లేదా కాల్చిన పప్పు తినడం మంచిది అని చెబుతున్నారు.

అయితే చక్కెర లేకుండా టీ త్రాగాలి. స్టెవియా లేదా కొద్దిగా బెల్లం వంటి సహజ స్వీటెనర్ జోడించడం మంచిది. అలాగే స్కిమ్డ్ మిల్క్‌తో టీ చేయాలట. పాలు, నీటి నిష్పత్తి సమానంగా ఉంచాలట. అలాగే టీలో లవంగాలు, ఏలకులు అల్లం జోడించడం మంచిది అని చెబుతున్నారు. అల్పాహారం వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు. స్నాక్స్ వంటివి కూడా తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ టీ తాగే వారు తక్కువ మోతాదులో తాగాలని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.