Site icon HashtagU Telugu

Mango Leaves: శరీర బరువును తగ్గించే మామిడి ఆకులు.. వీటిని ఎలా ఉపయోగించాలంటే?

Mango Leaves

Mango Leaves

ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం కోసం మొదట చేసే పని డైట్ ఫాలో అవ్వడం. కష్టమైనా సరే ఇష్టమైన వాటికి దూరంగా ఉంటారు. వాటితో పాటు ఇంకొంత మంది జిమ్ కి వెళ్లడం ఎక్ససైజ్ చేయడం వాకింగ్లు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసే విసిగిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు కొన్ని హోమ్ రెమిడీలను పాటిస్తే తప్పకుండా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అటువంటి వాటిలో ఇప్పుడు తెలుసుకోబోయే రెమిడి కూడా ఒకటి.

మనం ఇంట్లో తోరణాలుగా ఉపయోగించే మామిడి ఆకులతో బరువు తగ్గవచ్చట.. అయితే మరి అది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి ఆకులతో బరువు తగ్గడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవట. సహజ సిద్ధంగానే బరువును తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. కాగా మామిడి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు, అత్యధికంగా ఫైబర్ లభిస్తుందట. ప్రతిరోజు ఉదయాన్నే మామిడి ఆకుల కషాయాన్ని తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. మరి ఇంతకీ మామిడి ఆకుల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే..

పది నుంచి 15 మామిడి ఆకులను తీసుకోవాలి. వాటిని బాగా శుభ్రం చేసుకుని నీటిలో బాగా మరగనివ్వాలి. చల్లబడిన తర్వాత ఈ నీటిని వడగట్టుకొని ఉదయాన్నే ప్రతిరోజు పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. అయితే మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రెమెడీని ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే మీరు ఏవైనా వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ ని ఉపయోగిస్తున్నట్లయితే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.