Site icon HashtagU Telugu

Weight Loss : ఈజీగా బరువు తగ్గాలి అంటే జీలకర్రతో ఇలా చేయాల్సిందే?

If You Want To Lose Weight Easily, Do You Have To Do This With Cumin..

If You Want To Lose Weight Easily, Do You Have To Do This With Cumin..

Weight Loss with Jeera/Cumin : ప్రతి ఒక్కరి వంట గదిలో జీలకర్ర తప్పనిసరిగా ఉంటుంది. జీలకర్ర లేని వంటగది ఉండదు ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్క వంటకంలో కూడా ఈ జీలకర్ర ని ఉపయోగిస్తూ ఉంటారు. కేవలం ఎప్పుడు మాత్రమే కాకుండా పూర్వకాలం నుంచి ఈ జీలకర్రని ఉపయోగిస్తూనే ఉన్నారు. జీలకర్ర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆహారంలో భాగంగా వాడే జీలకర్రను పెర్ఫ్యూమ్స్ లో కూడా వినియోగిస్తారు. అనేక ఔషధ గుణాలున్న సహజసిద్ధమైన ఈ జీలకర్ర అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. నిజానికి జీలకర్రలో రెండు రకాలు ఉంటాయి. నల్ల జీలకర్ర ఒకటి మనం రెగ్యులర్ గా వాడే జీలకర్ర ఒకటి. బరువును తగ్గించడంలో (Weight Loss) కూడా జీలకర్ర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జీలకర్ర ఉపయోగించి బరువుని ఎలా తగ్గించుకోవాలో (Weight Loss) ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ఆయుర్వేదంలో కడుపునొప్పి మొదలు క్యాన్సర్ వరకు తయారు చేసే మందుల్లో జీలకర్రని తప్పకుండా వినియోగిస్తారు. అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి మనకు కాస్త కడుపు నొప్పి రాగానే కొంచెం జీలకర్ర నోట్లో వేసుకోమని జీలకర్ర వాటర్ మరిగించి తాగమని చెబుతారు. ఎందుకంటే చాలా ఇన్స్టంట్ గా కడుపునొప్పిని నయం చేస్తుంది. ఆహారం చేరడం కాకపోయినా విరోచనాలు అవుతున్న కడుపు ఉబ్బరంగా ఉన్న జీలకర్ర బాగా పనిచేస్తుంది. అంతే కాదు ఎన్నో రకాల వ్యాధులను నయం చేయగలదు. జీలకర్ర వాటర్ తాగండి చాలా అద్భుతంగా తలనొప్పి తగ్గిపోతుంది.

అంతే కాకుండా కిడ్నీలు మూత్రస్థాయిలో రాళ్లను కూడా కరిగిస్తుంది. జీలకర్ర కంటి సమస్యలకు కూడా జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రలో విటమిన్ ఏ క్యాల్షియం ఐరన్ అధికంగా ఉంటాయి. మనకు రోజు అవసరమయ్యే ఫైబర్ లో నాలుగో వంతు ఒక గ్రామం జీలకరలో లభిస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు జీలకర్రలో ఉన్నాయి. అయితే ఈ జీలకర్ర కషాయాన్ని మీరు ప్రతి రోజు పరగడుపున మాత్రమే తాగాలి. ఇలా తాగడం వల్ల అధిక బరువు (Weight Loss) సమస్య గాని పొట్ట చుట్టూ ఉండే కొవ్వుగాని లేదా రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే దివ్య ఔషధం జీలకర్ర కషాయాన్ని తాగడానికి ఎలాంటి సందేహం లేదు. జీలకర్రను మీ దయనందన ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. తరచూ జీలకర్రను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోయి ఈజీగా బరువు తగ్గుతారు.

Also Read:  Health Tips: మీకు నిద్ర లేవగానే నీరు తాగే అలవాటు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?