ప్రస్తుత రోజుల్లో చాలామంది ఒబేసిటీతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఒబేసిటీ సమస్యతో బాధ పడుతున్నారు. ఒబేసిటి కారణంగా అనేక రోగాల బారిన పడుతున్నారు. ఒబేసిటీ తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒబేసిటీని తగ్గించుకోవడానికి జీవనశైలిని మార్చుకోవడం, వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు ఒక పానీయాన్ని తాగితే బరువు తగ్గి నాజూగ్గా, స్లిమ్ గా మారుతారట.
కాగా మాములుగా బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. కేవలం గ్రీన్ టీ మాత్రమే కాదు గ్రీన్ కాఫీ కూడా బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు గ్రీన్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం చాలామంది గ్రీన్ కాఫీ నే ఇష్టపడుతున్నారు. గ్రీన్ కాఫీ చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో క్లోరో జెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అధిక రక్త పోటును తగ్గించి తద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గ్రీన్ కాఫీ తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇది డిప్రెషన్ రాకుండా ఆపుతుంది ఫలితంగా మనసు కూడా ఆనందంగా ఉంటుంది.
గ్రీన్ కాఫీ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ కాఫీ కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మపు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గ్రీన్ కాఫీ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది అంతేకాదు హార్మోన్లను కూడా నార్మల్ గా ఉండేలా చేస్తుంది. గ్రీన్ కాఫీ లో ఉండే క్లోరో జెనిక్ యాసిడ్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేసి, దానిని గణనీయంగా తగ్గిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. ఇక గ్రీన్ కాఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే గ్రీన్ కాఫీ గింజలను రాత్రిపూట నానబెట్టాలి. ఉదయం నానబెట్టిన నీటిని వడ పోసి బాగా మరిగించాలి. ఈ నీటిని ఐదు నుండి పది నిమిషాల పాటు మరిగించి దానిలో తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవాలి.