Onion for Weight loss: ఊబకాయం సమస్యకు చెక్ పెట్టాలంటే ఉల్లిపాయతో ఇలా చేయాల్సిందే?

ఉల్లిపాయతో (Onion) ఈ ఊబకాయం సమస్యకి చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్యులు. ఉల్లిలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 07:40 PM IST

Onion for Weight loss : ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఊబకాయం తగ్గించుకోవడానికి అనేక రకాల వంటింటి చిట్కాలను ఉపయోగించడంతోపాటు ఎన్నో రకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఉల్లిపాయతో (Onion) ఈ ఊబకాయం సమస్యకి చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్యులు. ఉల్లిలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. ఇది ఎన్నో వ్యాధుల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటుంటారు. అయితే ఉల్లిపాయ రసం (Onion Juice)లో ఉండే గుణాలు బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎన్నో విటమిన్లు ఉంటాయి. దీనిలో ఉండే ప్లేవనాయుడుస్ శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా అధిక బరువును తగ్గిస్తుంది. ఈ ఉల్లి రసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు తీసుకోవడం వలన స్థూలకాయం తగ్గిపోతుంది. బరువు తగ్గడానికి ఉల్లిపాయను ఎన్నో రకాలుగా తినవచ్చు. మరి ఉల్లిపాయతో ఊబకాయం సమస్యని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొంతమంది సలాడ్ లో ఉల్లిపాయలు వాడుతూ ఉంటారు. నిత్యం ఉల్లిపాయలు తింటే బరువు ఈజీగా తగ్గవచ్చు. అయితే పచ్చి ఉల్లిపాయ తీసుకోవడం వలన బరువు తొందరగా తగ్గుతారు.

మీరు నిత్యం మీ ఆహారంతో పాటు ఒక ఉల్లిపాయని సలాడ్ గా తీసుకుంటే ఎంతో సులభంగా బరువు తగ్గుతారు. ఉల్లిపాయ జ్యూస్ బరువు తగ్గించడానికి ఎంతో ప్రభావంతంగా ఉపయోగపడుతుంది. మీరు బరువు తగ్గడానికి మిగతా జ్యూసులు మాదిరిగానే ఉల్లిపాయ రసాన్ని కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. ఉల్లిపాయను మిక్సీలో గ్రైండ్ చేసి రసం చేసి దానిలో నిమ్మరసం ఉప్పు కలిపి తీసుకోవాలి. ఈ విధంగా నిత్యం ఉల్లిపాయ రసం తీసుకుంటే కొవ్వు ఎంతో తొందరగా కరిగిపోతుంది. బరువు తగ్గాలి అనుకున్న వారు ఉల్లిపాయ సూప్ తయారు చేసుకొని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఆపై నీటిలో వేసి ఉడకబెట్టాలి. వాటిని బాగా మరిగిన తర్వాత కావాలనుకుంటే సూపులో కొన్ని కూరగాయలు కూడా వేసుకోవచ్చు. సూప్ ని బాగా మరగబెట్టి దానికి నల్ల ఉప్పు వేసి తీసుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read:  Peepal Tree: శని అనుగ్రహం కలగాలంటే రావి చెట్టుని ఈ విధంగా పూజించాల్సిందే?