Site icon HashtagU Telugu

Health: మీరు హెల్దీగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇవి తినండి

Dry Fruits

Benefits of Anjura Dry Fruit in Winter Must Eat Dry Figs

Health: బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు తదితర పోషకాలున్నాయి. పిస్తాలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మన కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణశయాంతర ఆరోగ్యానికి సహాయపడుతుంది. మెదడుకు ఆరోగ్యకరం. వాల్‌నట్‌లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, పాలీఫెనాల్స్, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.

జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ఇవి తింటుంటే ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది.

చలికాలంలో రోగ నిరోధక శక్తి పడిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యల్నించి గట్టెక్కేందుకు రోజూ డ్రైఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ అనేవి పోషకాలలో నిండి ఉంటాయి. చలికాలంలో చాలా మంచిది. డ్రైఫ్రూట్స్‌ను పెరుగు, ఓట్స్, దలియాల్లో నానబెట్టి ఉదయం పరగడుపు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల బాడీ ఆరోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మస్తిష్కం వేగవంతమౌతుంది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మానికి చాలా మంచిది.