చెవిలోని మైనం (Ear Wax) లాంటి పసుపు రంగు పదార్థాన్ని గులిమి (ఇయర్ వాక్స్) అంటారు. దీన్ని మెడికల్ భాషలో సిరుమన్ అంటారు. మనం ఇయర్‌బడ్స్ సహాయంతో ఇయర్ వ్యాక్స్ ను శుభ్రం చేస్తుంటాం. అసలు విషయం ఏమిటంటే.. ఇయర్ వ్యాక్స్ (Ear Wax) మీ చెవులను రక్షిస్తుంది. చెవులలోకి దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్ వెళ్లకుండా రక్షణ కల్పిస్తుంది. అందుకే ఇయర్ వ్యాక్స్ ను మళ్లీ మళ్లీ శుభ్రం చేయడం సరికాదని, శుభ్రపరిచే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటారు. చాలా మంది ఇయర్ వ్యాక్స్ ను మురికిగా భావించి రోజూ చెవులను శుభ్రం చేసుకుంటారు. అయితే చెవి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మురికి అవసరమని గుర్తుంచుకోవాలి. చాలామంది ఇయర్ వ్యాక్స్ ను శుభ్రం చేయడానికి హెయిర్‌పిన్ లేదా అగ్గిపుల్ల వంటి పదునైన వస్తువులను కూడా ఉపయో గిస్తారు. ఇలా చేయడం చెవికి చాలా ప్రమాదకరం. ఇయర్ బడ్స్‌తో కూడా దీన్ని శుభ్రం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇయర్‌బడ్‌లు చెవిలో చాలా లోతుకు చేరితే.. అది చెవిపోటు పగిలిపోయేలా చేస్తుంది. దీని కారణంగా చెవిలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా జరగొచ్చు. తాత్కాలికంగా మీ వినే సామర్థ్యం కూడా నెగెటివ్ గా ప్రభావితం కావచ్చు.
వాళ్ళతో చెవులు శుభ్రం చేయించుకోవద్దు
కొన్ని రూపాయలకే చెవిని పూర్తిగా క్లీన్ చేస్తానని చెప్పేవారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఈ చెవి వాక్స్‌ని డర్ట్ అని పిలిచి, అది బాగా పెరుకుపోవడం వల్ల రోగాలు వస్తాయని బూటకపు మాటలు చెబుతారు. వాటిని నమ్మిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చెవులలోని గులిమిని (Ear Wax) ఒకేసారి పెద్దమొత్తంలో తొలగిస్తారు. అయితే దీనివల్ల చెవిపోటు సమస్యలు, చెవిలో కర్ణ భేరి ప్రాబ్లమ్స్ వస్తాయని గుర్తుంచుకోండి. మర్చిపోయి కూడా మీ చెవిని అలాంటి వారితో క్లీన్ చేయించుకోవద్దు.
ENT సర్జన్ దగ్గరకు వెళ్లండి
ఒకవేళ మీ చెవిలో గులిమి ఎక్కువగా ఉందని భావిస్తే నేరుగా ENT సర్జన్ దగ్గరకు వెళ్లండి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈఎన్‌టీ నిపుణులు ఉంటారు. అక్కడ మీరు అతితక్కువ రుసుము చెల్లించి సరైన చికిత్స పొందవచ్చు. ఒకసారి చెవిని శుభ్రం చేస్తే, చెవిలో కొత్త మైనపు ఏర్పడటానికి కనీసం 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు పట్టవచ్చు. ఇయర్ వ్యాక్స్ అనేది ధూళి కణాలను చెవిలోకి పోకుండా నిరోధిస్తుంది. కాబట్టి చెవిని పదే పదే శుభ్రం చేయకండి. మీ చెవిలో ఏదైనా ధూళి ఉందని అనిపిస్తే, చెవి క్లీనర్‌ల వలలో చిక్కుకోకుండా ENT నిపుణుడి వద్దకు వెళ్లండి.
ఇయర్ డ్రాప్స్ లో..
ఇయర్ వ్యాక్స్‌ను శుభ్రం చేయడానికి ఇయర్ డ్రాప్స్ సురక్షితమైన మార్గమని వైద్యులు చెబుతున్నప్పటికీ.. ఇది ఇయర్ వ్యాక్స్ ను మృదువుగా చేస్తుంది. తద్వారా అది స్వయంగా బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఇయర్ డ్రాప్స్ ఏ మెడికల్ స్టోర్‌లోనైనా సులభంగా దొరుకుతాయి. అయితే వాటిని కొనే ముందు మీరు డాక్టర్ సలహా తీసుకోవాలి.ఇయర్ డ్రాప్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం బైకార్బోనేట్ , సోడియం క్లోరైడ్ వంటి పదార్ధాలు ఉంటాయి. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. అయితే సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులు వీటిని ఉపయోగించడం వల్ల చెవిలో చికాకు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది చెవిలో గులిమిని (Ear Wax) శుభ్రం చేయడానికి నూనెను కూడా వేస్తారు. ఇలా రోజూ చేస్తే చెవికి మంచిది కాదు. నూనె వేయడం కంటే ఇయర్ డ్రాప్స్ వాడటం బెస్ట్.
నీటితో శుభ్రపరచడం
చెవిలో గులిమి సమస్య ఎక్కువగా ఉంటే చెవిని చాలాసార్లు నీటితో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఈ ప్రక్రియను సిరింగింగ్ అంటారు. దీనిలో ఇయర్‌వాక్స్‌ను క్లియర్ చేయడానికి సిరంజి ద్వారా చెవి లోపలి కాలువలపై నీటితో స్ప్రే పోస్తారు. ఇది గులిమిని (Ear Wax) క్లియర్ చేస్తుంది. కానీ చెవి యొక్క చర్మంపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా రోగి నొప్పిని కూడా అనుభవించవచ్చు.
మైక్రోసక్షన్
ఇయర్‌వాక్స్‌తో సమస్య ఉన్న రోగులకు మైక్రోసక్షన్ కూడా సిఫార్సు చేయబడింది. ఇందులో మీ చెవి కాలువను ముందుగా మైక్రోస్కోప్ సహాయంతో పరిశీలించి, ఆపై ఇయర్‌వాక్స్‌ను బయటకు తీయడానికి ‘హూవర్’ అనే చిన్న సాధనాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతి చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.
Also Read: Artificial Pancreas: కృత్రిమ ప్యాంక్రియాస్ తో ప్రయోగం సక్సెస్