Site icon HashtagU Telugu

Health Tips : వెల్లుల్లిని ఈ విధంగా తీసుకుంటే…హైబీపీ సమస్యే ఉండదు..!!

Garlic Benefits

Garlic Benefits

డయాబెటిస్ తర్వాత ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య బీపీ. ఇందులో హైబీపీ, లో బీపీ రెండూ ప్రమాదమే. బీపీ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని బీపీని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బీపీని తగ్గించుకునే మార్గాలను వెతుక్కోవాలి. అయితే వెల్లుల్లిని ప్రతిరోజూ తీసుకున్నట్లయితే బీపీని తగ్గించానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో బీపీని తగ్గించే గుణాలెన్నో ఉన్నాయి. ఇందులో అలిసన్ ఉంటుంి. అది బ్లడ్ వెసెల్స్ ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి.

ఈ విధంగా బీపీని కంట్రోల్లో ఉంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం వెల్లుల్లి తీసుకోవడం వల్ల సహాజంగా బీపీ కంట్రోల్లో ఉంటుంది. వెల్లుల్లిని తీసుకుంటే జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయని వెల్లడయ్యింది. కొలెస్ట్రాల్ తోపాటు జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వెల్లుల్లితో పరిష్కారం అవుతాయి. బీపీ తగ్గాలంటే వెల్లుల్లిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

1. ఉదయం లేచిన తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బును తినాలి.
2. వేడి సమస్య ఉంటే నేతిలో వెల్లుల్లిని వేయించి తినండి
3. బ్రెక్ ఫాస్ట్ సమయంలో కానీ మధ్యాహ్న భోజన సమయంలో కానీ తీసుకోండి.
ఈవిధంగా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
వెల్లుల్లి వల్ల కలిగే లాభాలు.
1. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
2. బరువు తగ్గుతారు.
3. ఇమ్యూనిటీలెవల్ పెరుగుతుంది.
4. అజీర్తి సమస్యలను పోగోడుతుంది.
5. జలుబు, దగ్గు సమస్యలను నివారిస్తుంది.
6. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
7. జాయింట్ పేయిన్స్ తగ్గుతాయి.
8. బీపీ కంట్రోల్లో ఉంటుంది.

 

Exit mobile version