Sleeping Naked: రాత్రిపూట నగ్నంగా పడుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

చాలామందికి రాత్రి సమయంలో నగ్నంగా పడుకోవడం అలవాటు. కొంతమంది మగవారు కేవలం షాట్ లేదా ఇన్నర్ వేర్ లాంటిది మాత్రమే వేసుకుని పడుకుంటే మర

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 10:00 PM IST

చాలామందికి రాత్రి సమయంలో నగ్నంగా పడుకోవడం అలవాటు. కొంతమంది మగవారు కేవలం షాట్ లేదా ఇన్నర్ వేర్ లాంటిది మాత్రమే వేసుకుని పడుకుంటే మరి కొంతమంది పూర్తిగా బట్టలు తొలగించి నగ్నంగా పడుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఇలా పడుకోవడానికి అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రాత్రి పూట ఇలా నగ్నంగా పడుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చట. అదేవిధంగా బరువు కూడా సులువుగా తగ్గవచ్చు అని అంటున్నారు నిపుణులు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి నగ్నంగా పడుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రి సమయంలో మందంపాటి దుస్తులు వేసుకోవడం వల్ల శరీరం సహజంగా చల్లబడదు. అందుకే రాత్రి నిద్రపోయే ముందు నగ్నంగా నిద్రించడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. పూర్తిగా నగ్నంగా ఉండలేని వారు అతి తక్కువ దుస్తులు ధరించి నిద్రపోవడం మంచిది. అంటే శరీరంలో 80% నగ్నంగా ఉండటమే మంచిది. ఇది రాత్రిపూట మీ చర్మం ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుంది. వేసవికాలంలో రాత్రి నిద్ర పోయేటప్పుడు లోదుస్తులు ధరించకపోవడమే మంచిది. ఇవి చెమట, తేమను పట్టి ఉంచుతాయి. దీనివల్ల జననేంద్రియాల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. రాత్రిపూట బాగా నిద్రపోతే మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఉదయం లేచాక చురుకుగా పనిచేసే అవకాశం ఉంది. శరీరం సౌకర్యవంతంగా, హాయిగా ఉన్నప్పుడే మీకు సరైన నిద్ర పడుతుంది. ఇలా నిద్ర పోవాలంటే శరీరమంతా గాలి తగులుతూ ఉండాలి. అందుకే నగ్నంగా నిద్రించమని చెబుతుంటారు. ఇలా నగ్నంగా నిద్రించడం వల్ల గ్రోత్ హార్మోన్స్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. చర్మం, జుట్టు చక్కగా ఎదుగుతాయి. రాత్రిపూట నగ్నంగా నిద్రించడం వల్ల అందం కూడా పెరుగుతుంది. చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. బరువు పెరిగే సమస్య కూడా అదుపులో ఉంటుంది. ఐదు గంటలకంటే తక్కువ సమయం నిద్రించే వారిలో బరువు పెరిగే సమస్య ఎక్కువ. నగ్నంగా నిద్రించడం వల్ల రాత్రిపూట మీ శరీరం చల్లగా ఉంటుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ సమయం నిద్రపోయే అవకాశం ఉంది. రాత్రిపూట నగ్నంగా నిద్రించలేని వారు తేలికైన బట్టలు వేసుకోవాలి. వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది.