Breakfast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

కాలం మారిపోవడంతో కాలానికి అనుగుణంగా మనుషుల ఆహారపు అలవాట్లు, జీవనశైలి అన్ని మారిపోయాయి. ఆహారపు

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 06:30 AM IST

కాలం మారిపోవడంతో కాలానికి అనుగుణంగా మనుషుల ఆహారపు అలవాట్లు, జీవనశైలి అన్ని మారిపోయాయి. ఆహారపు అలవాట్లు మారిపోవడంతో చాలా వరకు ప్రస్తుత రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఏరికోరి మరి కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత రోజులో చాలా వరకు సంపాదించిన డబ్బు చాలా వరకు హాస్పిటల్స్ కి ఖర్చు పెట్టడానికి సరిపోతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిర్లక్ష్యం వల్ల ఆ సమస్య మరింత తీవ్రతరమవుతోంది.

బిజీబిజీ షెడ్యూల్ వల్ల చాలా బాగుంది ఉదయం పూట అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఉదయాన్నే టిఫిన్ మానేసి డైరెక్ట్ గా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం పూట అల్పాహారాన్ని మిస్ చేసుకోకూడదు. ఒక రోజు బ్రేక్ ఫాస్ట్ తినేసి మరో రోజు తినకుండా మానేస్తు ఉంటారు. అలా చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తరచుగా ఒక రెగ్యులర్ డైట్ ని ఫాలో అవ్వడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుండడంతో పాటు నీరసం అలసట లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు.

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల గుండె జబ్బుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఊబకాయం వంటివి దరిచేరవు. పోషకాలు కలిగిన అల్పాహారం తీసుకుంటే రోజంతా ఆకలి బాధలను తగ్గించడంలో సహాయ పడుతుంది. అంతేకాదు టైప్ 2 డయాబెటిస్ కూడా రాకుండా ఉంచుతుంది. అల్పాహారం మానేస్తే జంక్ ఫుడ్ కు ఆకర్షితులు అవుతారు. అలాగే బ్రేక్ ఫాస్ట్ తింటే మీ బ్లడ్ షుగర్, ఇన్సులిన్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచుతుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు.