Nutrients: తెలిస్తే దీన్ని అస్సలు వదలరు.. 83 రకాల పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

అన్ని రకాల పోషకాలు అందితేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. అయితే వివిధ పోషకాలు పొందడానికి మూలపదార్దాలు కొన్ని ఉంటాయి వాటి ద్వారా ఆయా పోషకాలు మనం పొందవచ్చు.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 04:07 PM IST

Nutrients: అన్ని రకాల పోషకాలు అందితేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. అయితే వివిధ పోషకాలు పొందడానికి మూలపదార్దాలు కొన్ని ఉంటాయి వాటి ద్వారా ఆయా పోషకాలు మనం పొందవచ్చు. అయితే ఇటీవల పరిశోధన ఫలితాలు పోషకాల గురించి ఫలితాలు వెల్లడించాయి. ప్రకృతిలో 92 సహజ రసాయనిక మూలకాలు ఉంటాయని, పంటలకు 18 పోషకాలు అత్యవసరమని, 15 మట్టి నుంచి, 3 వాతావరణం నుంచి అవి అందుతున్నాయని ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ) చెబుతోంది. ఈ గణాంకాలు రసాయనిక వ్యవసాయంలో పండించిన ఆహారానికి సంబంధించినదని తెలుపుతున్నారు.

దుబాయ్‌లో 715 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మైక్రోగ్రీన్స్‌ పండిస్తున్న అర్బన్‌ వ్యవసాయ క్షేత్రం “న్యూ లీఫ్‌”. ఇది పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లకు ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్‌, పచ్చివే తినదగిన పువ్వుల (ఎడిబుల్‌ ఫ్లవర్స్‌)ను పండించి, తాజా తాజాగా సరఫరా చేస్తుంది. ఆడమ్‌ అనే వ్యక్తి.. తన ఇండోర్‌ ఫార్మింగ్‌ ప్రయాణాన్ని 20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అనారోగ్యంతో బదపడుతున్న తన తండ్రి కోసం.. క్రషెస్‌ లాంటి “మైక్రోగ్రీన్స్‌” పండించటానికి “న్యూ లైఫ్‌” సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం 58 రకాల మైక్రోగ్రీన్స్‌, ఎడిబుల్‌ ఫ్లవర్స్‌ను దుబాయ్‌ ప్రజలకు అందిచే స్థాయికి ఎదిగారు.

ఈ న్యూ లైఫ్ సంస్థలో ప్రత్యేక వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నట్టు వారు తెలిపారు. ప్రత్యేక సేంద్రియ ఎరువులతో మట్టిలో తాము పండించే “మైక్రోగ్రీన్స్‌” లో 83 రకాల పోషకాలు ఉంటాయని ఈ వర్జికల్‌ అర్బన్‌ ఫార్మింగ్‌ సంస్థ న్యూ లీఫ్‌ వ్యవస్థాపకుడు “ఆడమ్‌ పిట్స్‌” ప్రకటించారు. ఈ రోజుల్లో ఇలాంటి సేంద్రియ పద్ధతిలో పండించే తాజా ఆహార పదార్దాలు దొరకడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆడమ్ అందిస్తున్న ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉందని తెలుస్తోంది.

తమ ఉత్పత్తి అయిన మైక్రోగ్రీన్స్‌లో పుష్కలమైన ప్రయోజకాలు ఉంటాయని తెలుపుతున్నారు. బాగా పెరిగిన ఆకుకూరల కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్‌ తోపాటు, పొటాషియం, ఐరన్‌, జింక్‌, కాపర్‌, మెగ్నీషియం వంటి వివిధ రకాల ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, అల్జీమర్స్‌, డయాబెటిస్‌, కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.