Guava leaf tea: చలికాలంలో జామ ఆకు టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

మామూలుగా చలికాలంలో ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే చలికాలంలో అనేక

Published By: HashtagU Telugu Desk
Mixcollage 01 Jan 2024 08 21 Pm 121

Mixcollage 01 Jan 2024 08 21 Pm 121

మామూలుగా చలికాలంలో ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే చలికాలంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. దానికి తోడు సీజనల్ వ్యాదులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే చలికాలం ఆహారం, ఆరోగ్యం అలాగే జీవనశైలి విషయంలో కొన్ని రకాల మార్పులు తప్పనిసరి. ఇకపోతే చాలామంది చలికాలం ఎక్కువగా వేడి వేడి పదార్థాలను తాగడానికి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది టీ కాఫీ సమోసా బజ్జీలు వంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఎప్పుడూ తాగే టీ, కాఫీలు మాత్రమే కాకుండా చలికాలంలో జామ ఆకులతో తయారు చేసిన టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదట.

మరి జామ ఆకుల టీ వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. జామ ఆకు టీ తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులలో విటమిన్ సి అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్ లతో పోరాడటానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటాయి. రోజుకు ఒక కప్పు జామ ఆకు టీ తాగడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు. జామ ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశంలో మంటను తగ్గించడంతో పాటు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు జామ ఆకు టీలో విటమిన్ సి అధిక స్థాయిలో ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఫలితంగా అనారోగ్యాలు దరిచేరవు. శీతాకాలంలో అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వేధిస్తుంటాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జామ ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి చలికాలంలో జామఆకు టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జామ ఆకు టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. వివిధ అధ్యయనాలు ఈ ఆకులు హైపోగ్లైసీమిక్ సమ్మేళనాలను కలిగి ఉన్నాయని నిరూపించాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. జామ ఆకు టీ అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉన్నందున చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ సమ్మేళనాలు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

  Last Updated: 01 Jan 2024, 08:22 PM IST