గుండె జబ్బులు (Heart Diseases) దేశంలో మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా నిలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 4.7 మిలియన్ల మంది గుండె సమస్యల కారణంగా మరణిస్తారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలో వెల్లడైంది. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఊబకాయం వంటి ప్రధాన కారణాలు గుండె అనారోగ్యానికి దారితీస్తాయి. అయితే ఈ ప్రధాన కారకాలు మాత్రమే కాదు, కొన్ని చిన్న కారణాలు కూడా గుండెకు భారీ ప్రమాదాలను కలిగించవచ్చు. దీర్ఘకాలంలో ఈ చిన్న కారణాలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపగలవని నిపుణులు అంటున్నారు.
Sunitha-Pravasthi Aaradhya : సునీతను వదలని ప్రవస్తి మరో కౌంటర్ వేసేసిందిగా !
గుండె జబ్బులకు (Heart Diseases) అనేక ప్రమాద కారకాలు ఉంటాయి, వాటిలో ముఖ్యమైనది దీర్ఘకాలిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశలు శరీరంలో కార్టిసాల్ స్థాయిని పెంచి, గుండెకు నష్టం కలిగిస్తాయి. అలాగే నిశ్చల జీవనశైలి కూడా గుండె జబ్బులకు కారణం అవుతుంది. వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం వంటి అలవాట్లు రక్తపోటును పెంచి, గుండెకు హాని కలిగిస్తాయి. వీటితో పాటు నిద్ర లేమి, వాయు కాలుష్యం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా గుండెకు సంబంధించి ప్రమాదకరంగా మారవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకమైంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ నూనె వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు వంటివి తగ్గించడం అవసరం. అలాగే, నడక, వ్యాయామం, యోగా వంటి శారీరక చైతన్యాన్ని ప్రోత్సహించడం కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సో చిన్న చిన్న తప్పులు చేసి పెను ప్రమాదం బారిన పడొద్దు.