Site icon HashtagU Telugu

Piles: పైల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని అస్సలు తినకండి?

Piles

Piles

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పైల్స్ సమస్య కూడా. ఆహారపు అలవాట్ల మార్పు కారణంగా ఎక్కువ శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పైల్స్ బాధ భరించడం చాలా కష్టం. దీనినే హెమోరాయిడ్స్ అని అంటారు. అయితే ఈ సమస్య గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా చాలామంది సిగ్గుతో వైద్యుని దగ్గరకు వెళ్లడానికి కూడా మొహమాటపడుతూ ఉంటారు. అయితే ఫైల్స్ సమస్య తరచుగా వేధిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.

పైల్స్ ఉన్న వ్యక్తికి మలద్వారం వెలుపల, లోపల వాపు ఉంటుంది. విసర్జించే సమయంలో నొప్పి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది. ఈ సమస్య ఉంటే మలవిసర్జన సమయంలో కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. పైల్స్ వ్యాధి ఏ వయస్సు వారికైనా సంభవించవచ్చు. ఈ వ్యాధికి ప్రధాన కారణం మలబద్ధకం, గ్యాస్ సమస్యలు, జీర్ణ సమస్యలు అయితే ఇటువంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రాసెస్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. దాంతో ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల అవి జీర్ణం కావడం కష్టం. వాటిలో తక్కువ పోషకాలు ఉంటాయి. ఉప్పు పుష్కలంగా ఉంటుంది. అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియ వ్యవస్థను దెబ్బతీస్తాయం. మీకు పైల్స్ ఉంటే, స్పైసీ ఫుడ్ తినేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీకు ఇష్టమైన ఫ్రైడ్ రైస్ లు, పిజ్జాలు పైల్స్ బాధను మరింత పెంచుతాయి.  అలాగే ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా మానేయాలి. లేదంటే తగ్గించాలి.

ఆల్కహాల్ జీర్ణ సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రేగులపై డీహైడ్రేటింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. ఒక్కోసారి పాల ఉత్పత్తులు కూడా చాలా సార్లు గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. మలబద్ధకానికి దారితీస్తుంది. పాలు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులు వ్యాధి ప్రబలినప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉంటాయి. పైల్స్ బాధ నుంచి బయటపడడానికి పండ్లు ఉత్తమమైన ఆహారం. అయితే, పండిన పండ్లను మాత్రమే తీసుకోవాలి. పండని పండ్లు పైల్స్ నొప్పిని, బాధను మరింత పెంచుతాయి. అధిక ఉప్పు కంటెంట్ శరీరంలో నీరు నిల్వ ఉండడానికి కారణమవుతుంది. ఇది రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవాలి.

Exit mobile version