Site icon HashtagU Telugu

Ear Pain: ఈ రెండు చుక్కల రసం చెవిలో వేస్తే చాలు.. ఎలాంటి చెవి నొప్పి అయినా వెంటనే తగ్గిపోవడం ఖాయం!

Ear Pain

Ear Pain

మామూలుగా కొన్ని కొన్ని సందర్భాలలో చెవి నొప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చెవి నొప్పి రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు చెవి నొప్పి భరించడం కష్టంగా ఉంటుంది. అయితే అలాంటప్పుడు కొంతమంది ఇయర్ డ్రాప్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా చెవి నొప్పిని తగ్గించుకోవచ్చట. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జలుబు, దగ్గు అధికంగా ఉన్న వారిలో చెవి నొప్పి వస్తూ ఉంటుంది. చెవిలోకి ఏదైనా కీటకం ప్రవేశించడం వల్ల కూడా విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఈత కొట్టేటప్పుడు లేదా స్నానం చేసినప్పుడు చెవిలోకి నీరు ప్రవేశించి అక్కడ ఇన్ఫెక్షన్‌ కు కారణమైతే నొప్పి విపరీతంగా వస్తుంది. అలాగే చెవిలో ఉండే గులిమి ఎక్కువగా పేరుకుపోయి గట్టిగా మారిపోయినా కూడా నొప్పి వస్తుంది. కొంతమంది తలకు గాయం తగలడం వల్ల లేదా చెవిలోకి ఏదైనా వస్తువు ప్రవేశించినా కూడా చెవిపోటు వచ్చే అవకాశం ఉంటుందట. ఇలా చాలా రకాల కారణాల వల్ల చెవి నొప్పి వస్తుందని చెబుతున్నారు. ఇలా అనేక రకాల కారణాలవల్ల చెవి నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ఎందువల్ల అలా చెవి నొప్పి వస్తుందో తెలుసుకోవాలి.

ఇకపోతే చెవి నొప్పి విపరీతంగా వస్తున్నప్పుడు ఆవనూనెను తీసుకోవాలట. వెల్లుల్లి రెబ్బను సన్నగా తురిమి ఆవనూనెలో వేసి వేడి చేయాలట. ఆ నూనె చల్లారాక వడకట్టాలని చెబుతున్నారు. చెవిలో ఈ నూనెను రెండు నుంచి మూడు చుక్కలు వేయాలట. ఇది చెవి నొప్పిని కొంతవరకు తగ్గిస్తుందని చెబుతున్నారు.

అలాగే ఒక చెంచా ఉల్లిపాయ రసాన్ని తీసుకొని వేడి చేయాలట. ఆ ఉల్లిపాయ రసాన్ని రెండు మూడు చుక్కలు చెవిలో వేయడం వల్ల కాస్త నొప్పి తగ్గుతుందట. ఇలా రోజులో మూడు సార్లు చేయడం వల్ల నొప్పి కొంతవరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

అలాగే తులసి ఆకుల రసం చెవిలో పోయడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చట. రెండు రోజులపాటు తరచూ తులసి ఆకుల రసాన్ని చెవిలో వేస్తే చెవి నొప్పి పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

చెవి నొప్పికి వేపాకుల రసం కూడా ఎంతో బాగా పనిచేస్తుందట. వేపాకుల రసంతో కూడా చెవి నొప్పిని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. వేపాకుల రసాన్ని రెండు మూడు చుక్కలు చెవిలో వేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుందట. తద్వారా చెవి నొప్పి కూడా కంట్రోల్ అవుతుందట.