Site icon HashtagU Telugu

Health Tips: నోటిపూత సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Mixcollage 09 Jul 2024 07 36 Am 7920

Mixcollage 09 Jul 2024 07 36 Am 7920

మాములుగా మనలో చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా నోటి పూత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోటి పూత కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా, వేడి తాగాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కారం వస్తువులు తినాలి అన్న కూడా కాస్త భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వేడి పదార్థాలు కారం ఉన్న పదార్థాలు తిన్నప్పుడు అక్కడ మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నోటి పూత సమస్యలు ఎక్కువగా పోషకాహార లోపం వల్ల వస్తూ ఉంటాయి. అలాగే కడుపు శుభ్రంగా లేకపోయినా కూడా శరీర ఉష్ణోగ్రతలు పెరిగిన నోటిపూత సమస్యలు వస్తుంటాయి.

ఇంకా అనేక రకాల కారణాల వల్ల ఈ నోటిపూత సమస్య వస్తూ ఉంటుంది. నోటిపూతను తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా నోటిపూత సమస్యతో బాధపడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు వెంటనే ఉపశమనం పొందవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, జింక్, ఫోలికామ్లం, బి12, సి విటమిన్లు, ఐరన్ మొదలైనవి లోపించడం వల్ల కూడా నోటి పూత వస్తుంది. అప్పుడప్పుడు మన తినేటప్పుడు కోరుక్కుంటే కూడా నోటి పూత వస్తుంది. ఈ నోటి పూతకు తేనె చక్కని ఉపశమనంగా పని చేస్తుంది. తేనెలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల నోటిపూత నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. తేనెలో కాస్త పసుపు వేసుకుని దాన్ని నోటి పూత ఉన్న భాగంలో అప్లై చేయాలి.

ఇలా చేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది. అలాగే నోటి పూత సమస్య ఉన్నవారు లవంగం నమలడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. యాలకులు తినడం వల్ల కూడా ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. కొబ్బరి నీళ్ళు లేదా ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల కూడా ఈ నోటి పూత సమస్యను తగ్గించుకోవచ్చు. నోటి పూత ఉన్నచోట కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. తులసి ఆకుల్లో చాలా ఔషధ గుణాలున్నాయి. వీటి వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. నోటిలో కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత కొన్ని తులసి ఆకుల్ని వేసుకుని నీటితో పాటే నమలాలి. ఇలా రోజుకు నాలుగు ఐదు సార్లు చేయాలి. దీనివల్ల నోటిపూత త్వరగా తగ్గే అవకాశం ఉంది. నోటిపూత వచ్చిన వారు ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. వారు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువగా వేడి చేసే వస్తువులు తినకూడదు.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యులను సంప్రదించడం మంచిది.