Ultra Processed Food: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే.. క్యాన్సర్ రిస్క్!

ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.

  • Written By:
  • Updated On - February 8, 2023 / 04:07 PM IST

“ఫుడ్స్ లో.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వేరయా” అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం 10 శాతం పెరిగితే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 2 శాతం పెరుగుతుందట.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడంలో ప్రతి 10% పెరుగుదలకు, క్యాన్సర్ మరణాలు 6% పెరిగాయట.

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం 10 శాతం పెంచడం వల్ల రొమ్ము క్యాన్సర్ మరణాల రేటు 16 శాతం పెరిగిందట. అండాశయ క్యాన్సర్ మరణాల రేటు కూడా 30 శాతం పెరిగిందట.

ఇవన్నీ ఊహాగానాలు కాదు.. “ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్” తాజా పరిశోధనలోని వివరాలు. మన బాడీకి కావాల్సిన ఫైబర్ , ప్రొటీన్స్ అతి తక్కువగా.. మన బాడీకి హానికలిగించే షుగర్ , ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇంతకీ ఏమిటీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ? అంటే.. ఈ లిస్టులో ప్యాక్ చేసిన స్నాక్స్, కూల్ డ్రింక్స్, కేకులు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన స్వీట్లు, పిజ్జా, పాస్తా, బర్గర్‌లు, నూడుల్స్ ఉన్నాయి. మీరు , మీకు తెలిసిన వారు వీటికి అలవాటు పడి ఉంటే.. ఇప్పటికైనా అలర్ట్ కండి. ఇలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉంటే హెల్త్ కు మంచిదని అందరికీ అవగాహన కల్పించండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చివరకు క్యాన్సర్ , ఊబకాయం, షుగర్ వంటి వ్యాధులకు కూడా దారి తీస్తుందని తెలుసుకోండి. నాలుక రుచిని చల్లార్చుకునే ప్రయత్నంలో మొత్తం జీవితపు సమయాన్ని తగ్గించుకోకండి. మీ ఆయుష్షును పెంచుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు అడుగులు వేయండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల కడుపు నిండుతుంది. కానీ బరువు కూడా వేగంగా పెరుగుతుంది. బరువుతో పాటు వ్యాధులు కూడా బోనస్ గా వస్తాయి.

తాజా పరిశోధనలో ఏం తేలింది?

అల్ట్రా ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ తాజా పరిశోధనలో వెల్లడైంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆరోగ్యానికి అత్యంత హానికరమైన ఆహారమని శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు 2 లక్షలమంది ఆహారపు అలవాట్ల వివరాలు, వారి హెల్త్ రిపోర్టులను సేకరించి 10 సంవత్సరాల పాటు జరిపిన అధ్యయనంలో ఈవిషయాన్ని గుర్తించారు.అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తిన్నవారిలో 34 రకాల క్యాన్సర్‌లను గుర్తించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అండాశయ క్యాన్సర్ , మెదడు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కూడా కొందరికి వచ్చాయని తెలిపారు. ఇలా క్యాన్సర్‌ వచ్చి మరణించిన వారిలో ఎక్కువ మంది అండాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. పరిశోధకులు ఎత్తి చూపారు.