Good Food & Sleep: నిద్ర పట్టడం లేదా.. అయితే మీరు తినే ఆహారంలో ఈ ఆహార పదార్థాలు జోడించాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి సమస్య అన్నది ప్రధాన కారణంగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలి,

  • Written By:
  • Publish Date - July 15, 2022 / 07:15 AM IST

ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి సమస్య అన్నది ప్రధాన కారణంగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలి, తినే ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు ఇలా అనేక కారణాల వల్ల ఈ నిద్రలేని సమస్య బారిన పడుతున్నారు. అయితే ఈ నిద్రలేని సమస్య కారణంగా శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నిద్రలేని సమస్య మధుమేహం, ఉబకాయం,గుండె జబ్బులకు దారితీస్తుంది. మరి ఈ నిద్రలేమి సమస్య నుంచి బయట పడాలంటే మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలను ఉండేలా చూసుకోవాలి. మరి ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నట్స్: డ్రై ఫ్రూట్స్.. శరీరంలో ఆరోగ్యానికీ సంబంధించి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. మరి ముఖ్యంగా వాల్నట్స్ బాదం లాంటివి నిద్రకు బాగా తోడ్పడతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ తరహా గింజల్లో ట్రైప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్ర బాగా పడుతుంది.

గడ్డి చామంతి లేదా సీమ చామంతి టీ: టీ కాఫీలాంటివి నిద్రకు ప్రధాన శత్రువులుగా చెప్పుకోవచ్చు. కాఫీ టీ లలో ఉండే టిఫిన్ అనే రసాయనం నిద్రను చెడగొడుతుంది. అయితే గడ్డి చామంతి లేదా సీమ చామంతిగా పిలిచే చమోమైల్ టీ మాత్రం నిద్రకు బాగా ఉపకరిస్తుంది. చమోమైల్ టీని రోజూ రాత్రి తాగడం నిద్ర బాగా పడుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర బాగా రావడానికి తోడ్పడుతుంది.

కివీ పండ్లు: చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడే తిండ్లు కివి. వీటిలో ఎక్కువగా సెరటోనిన్ మన శరీరంలో మెలటోనిన్ అనే ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది. తద్వారా మంచి నిద్ర పడుతుంది.

పెరుగు: మంచి నిద్రకు తోడ్పడే వాటిలో పెరుగు కూడా ఒకటి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి పెరుగు తోడ్పడంతో పాటు విటమిన్ బీ12, కాల్షియం, ప్రొటీన్ వంటి పోషకాలన్నీ కూడా మంచి నిద్రకు సహకరిస్తాయి.

పుట్టగొడుగులు: చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. పుట్టగొడుగులుశరీరంలో రోగ నిరోధక వ్యవస్థ, గుండె సరిగా పనిచేసేందుకు తోడ్పడంతో పాటు మంచి నిద్రకూ పనికివస్తాయని అంటున్నారు.

టమాటాలు: వీటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మంచి నిద్ర కలిగేందుకు తోడ్పడే ప్రక్రియలను ప్రేరేపిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

బ్రకొలీ: ఇందులో ఎక్కువ పోషకాలు, ఫైబర్ ఉండి తక్కువ కేలరీల శక్తి ఉండే ఆహారంగా బ్రకొలీ మంచి ప్రాచుర్యం పొందింది. అయితే బ్రకొలీ మన నిద్రలో రెమ్ అనే దశను మెరుగుపర్చడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే నిద్రలో ఈ రెమ్ దశ ఎంత బాగుంటే, ఎక్కువ సేపు ఉంటే అంత బాగా నిద్రపోయినట్టు అన్నమాట.

అరటి పండ్లు: అరటి పండ్లలో విటమిన్ బీ తోపాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ మంచి నిద్రకు దోహదం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

చేపలు: సాల్మన్ రకం చేపల్లో ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చాలా రకాల జీవ క్రియలు సక్రమంగా జరిగేందుకు తోడ్పడడంతో పాటు మంచి నిద్ర పట్టేందుకు వీలు కలిగిస్తుంది.