Site icon HashtagU Telugu

Joint Pains : ఈ టీ వారం రోజులు తాగితే…కీళ్ల నొప్పులు మటుమాయం..!!

Kalonji Oil

Kalonji Oil

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కప్పుడు 60ఏళ్లు వచ్చిన తర్వాతే కీళ్ల నొప్పులు, కండరాలు నొప్పులు వేధించేవి. కానీ ఇప్పుడు పడుచు పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్నో మందులు వాడుతున్నారు. అయినా సమస్య తీవ్రం అవుతుంది తప్పా పరిష్కారం కావడం లేదు. అయితే జాయింట్ పెయిన్స్ నుంచి బయటపడాలంటే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో తయారు చేసిన టీని తాగినట్లయితే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

1. సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. వాము, కలోంజీ విత్తనాలు తీసుకుని ఒక గ్లాసులో నీటిలో పావు స్పూన్ వాము, పావు టీ స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నీటిలో ఉన్న విత్తనాలను తింటూ ఆ నీటిని తాగాలి.

2. ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో వాము, కలోంజీ గింజలు వేసి ఆరు నిమిషాల పాటు మరగించండి. తర్వాత ఆ నీటిని వడగట్టి…ఈ నీటిలో తేనే కలుపుకి తాగండి. డయాబెటిస్ ఉన్నవాళ్లు తేనే కలుపుకోకపోవడం మంచిది. ఈ విధంగా వారం రోజులు చేసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది.

3. వాము కలోంజీ గింజలు రెండు అందుబాటులో ఉంటాయి. కాస్త ఓపికతో దీన్ని తయారు చేసుకోవాలి. కీళ్ల నొప్పులుతోపాటు అధికబరువు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గిపోతాయి.