Health: ఈ జ్యూస్ తాగితే ఒంటిలో వేడి మటాష్.. అదేంటో తెలుసా

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 05:54 PM IST

Health: జావ తో అనేక ఆరోగ్య ప్రయోజాలున్నాయి.  బార్లీ ని premix పౌడర్ గా చేసి పెట్టుకుంటే ఈజీగా డైలీ కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా బార్లీ నానపెట్టుకొని , ఉడక పెట్టుకొని ఇదంతా టైం లేక అశ్రద్ధ చేస్తాం. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇలా చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. ముందుగా పాన్లో బార్లీ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించి పొడి చేసుకోవడం వల్ల వేస్ట్ అనేది అవ్వదు .సో వీటిని బాగా కలుపుకుంటూ వేయించుకొని ఒక మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకుందాం. ఇది స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జావ కలుపుకోవచ్చు.

ఈ premix బార్లీ పౌడర్ ని ఇప్పుడు ఒక ఐదు కప్పుల నీళ్లు తీసుకొని అందులో ఒక కప్పు బార్లీ పౌడర్ ని తీసుకోవాలి. direct గా ఎప్పుడు ఏ పిండిలు water లో కలపకూడదు. కాబట్టి కొంచెం వాటర్ తో బార్లీ పౌడర్ ని ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని మరిగే నీళ్లలో కలుపుకోవాలి. గరిటతో కలుపుకుంటూ ఉండాలి. మరిగే నీళ్లల్లో చిన్న అల్లం ముక్క, ఉప్పు కూడా వేసుకోండి. కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లో సబ్జా గింజలు నానపెట్టి, కరివేపాకు, నిమ్మరసం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం మజ్జిగ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది.