Site icon HashtagU Telugu

Health: ఈ జ్యూస్ తో తాగితే అన్ని రోగాలు దూరం

Summer Drinks

Health: బూడిద గుమ్మడి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీన్ని జ్యూస్ గా తీసుకోవడం చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు. ఉదయం పూట తాగే జ్యూస్ తో మరిన్ని లాభాలున్నాయి. కిడ్నీలో రాళ్లను తొలగించటానికి బూడిద గుమ్మడి బాగా హెల్ప్ చేస్తుంది. గుండె సమస్యలు ఉన్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనితో కూరో, పచ్చడో చేసుకుని తరుచూ తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుమ్మడిలో ఉండే పీచు, విటమిన్‌లు గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. అలాగే అందులో పొటాషియం అధిక రక్తపోటును నిరోధిస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచి, వైరస్‌లు, ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా చూస్తుంది. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే మలబద్దకంతో బాధపడే వారు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్దకం తగ్గుతుంది.

మసాలా ఆహారాలు ఎక్కువగా తిన్నప్పుడు మరియు ఉపవాసం కారణంగా ఏమి తిననప్పుడు ఏర్పడే గ్యాస్ ని ఎదుర్కొంటుంది. యాంటీ మైక్రోబియల్ ఏజెంట్‌గా పనిచేసి కడుపు మరియు పేగులోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. జీర్ణాశయానికి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. బూడిద గుమ్మడిలో 96 శాతం నీరు ఉండుట వలన బరువు తగ్గేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు.

Exit mobile version