Site icon HashtagU Telugu

Reduce Weight : బరువు తగ్గాలని ఆహారం తినడం మానేస్తే మీ శరీరానికి ఏమవుతుందో తెలుసా?

If you avoid Food for Reducing Weight it Causes Health Issues

If you avoid Food for Reducing Weight it Causes Health Issues

బరువు తగ్గాలి(Reduce Weight) అని అనుకునేవారు చాలా మంది ముందుగా ఆహారాన్ని(Food) తినడం మానేస్తారు. కానీ ఇలా చేయడం వలన అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. బరువు తగ్గాలి అనుకుంటే సరైన పద్దతిలో తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకొని డైట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం తినే ఆహారం మన శరీరంలోని ప్రతి అవయవానికి శక్తిని అందిస్తుంది. మనం తినడం మానేస్తే మన శరీరం శక్తిని కోల్పోతుంది.

మనం ఎక్కువ సమయం తినకుండా ఉన్న లేదా అల్పాహారం తినకపోయినా మానసికంగా ఒత్తిడికి మరియు నిరాశకు గురవుతాము. ఎక్కువసేపు ఆహారం తినకుండా ఉండడం వలన మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. కార్టిసాల్ మన శరీరంలో చక్కర స్థాయిలను నియంత్రించి ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. దీని వలన మనం నిరాశగా, చిరాకుగా ప్రవర్తిస్తుంటాము.

ఆహారాన్ని తినకుండా ఉండడం వలన వికారం, విరోచనాలు, తీవ్రమైన మలబద్దకం వంటి సమస్యలకు గురవుతారు. ఆహారం తినకపోవడం వలన అలసట, నీరసం వస్తాయి. డైట్ చేసేవారికి ఈటింగ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహారం మన శరీరానికి అందకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. తక్కువ క్యాలరీలు, తక్కువ కొవ్వు, పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తిని సరైన ఆహార సమతుల్యతను పాటిస్తూ కూడా మీరు బరువు తగ్గవచ్చు. అంతేగాని ఆహారం తినకుండా బరువు తగ్గాలి అనుకోవడం అంత మంచి పద్దతి కాదు.

 

Also Read : Health Benefits: చలికాలంలో పెరుగు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?