Curd: పెరుగులో ఈ గింజలు కలిపి తీసుకుంటే చాలు షుగర్ తగ్గిపోవడం ఖాయం?

  • Written By:
  • Updated On - March 5, 2024 / 02:02 PM IST

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు.

డయాబెటిస్ పేషెంట్లు రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. మీరు కూడా అలా ఎన్నో ప్రయత్నాలు చేసే విసిగిపోయారా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాను పాటించాల్సిందే. డయాబెటిస్ తగ్గడానికి అలాగే మానసికంగా కృంగిపోకుండా ముందు ధైర్యంగా ఉంటూ ఆహరం మార్చుకొని దానికనుగుణంగా ప్రతిరోజు వాకింగ్ చేస్తూ తగినంతగా విశ్రాంతి తీసుకుంటూ చక్కగా ఉంటే డయాబెటిస్ అనే సమస్య నుంచి మీరు బయటపడచ్చు. అయితే డయాబెటిస్ సమస్య నుంచి ఈజీగా బయటపడాలి అంటే మజ్జిగలో నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గి షుగర్ అదుపులో ఉంటుంది.

అలాగే మెంతులు నీరు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. తరచూ రక్తంలో చక్కెర శాతం ఎక్కువ అవుతుంది అనుకున్న వారు మజ్జిగలో మెంతులను కలిపి తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. షుగర్ ఎక్కువ తక్కువ అవుతున్న వారు ఈ రెమెడీని తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.