Custard Apple : ఆ మూడు రకాల వ్యాధులు ఉన్నవారు సీతాఫలం తింటే ఇక అంతే సంగతులు..

సీతాఫలం (Custard Apple) వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 01:35 PM IST

These People Need to Avoid Eating Custard Apple : ప్రస్తుతం మనకు మార్కెట్లో సీతాఫలం లభిస్తున్నాయి. సీతాఫలాలు మనకు ఎక్కువగా చలికాలంలో లభిస్తూ ఉంటాయి. ఈ సీతాఫలాలు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. సీతాఫలం (Custard Apple) వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. దీనిలో ఖనిజాలు, విటమిన్లతో పాటుగా పీచు పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే సీతాఫలం (Custard Apple) తినడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు సీతాఫలం (Custard Apple)ని అస్సలు తినకూడదు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు సీతాఫలం తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

సీతాఫలం గుజ్జు ఆకులు, గింజలు ప్రతి ఒక్కటి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసి అద్భుతమైన శక్తి ఈ పండుకి ఉన్నది. ఈ పండు సంజీవిని లాగా ఉపయోగపడుతుంది. కణాల క్షీణతకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ విటమిన్ సి సమర్థవంతంగా వాటిపై యుద్ధం చేస్తుంది. ఏడాది పాటు ఇబ్బంది పడే ఎటువంటి వ్యాధి అయినా ఈ పండు తినడం వల్ల ఉపశమనం కలిగించుకోవచ్చు. అలాగే జుట్టు, చర్మ సంరక్షణకు ఈ సీతాఫలంలో ఉండే విటమిన్ ఏ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులకి కూడా చాలా బాగా సహాయపడుతుంది.

ఈ పండుని శీతాకాలంలో తీసుకోవడం వలన మలబద్దకాన్ని పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కాపర్ గుణాలు బరువు తక్కువగా ఉన్నవాళ్లు బరువు పెరగాలి అనుకునేవారు సీతాఫలాలను ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. ఈ పండు సీడ్స్ ని పొడి చేసుకుని తలలో పేలును పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ ఆకులను రసంగా చేసి గాయాలకు పెట్టడం వలన గాయాలు తొందరగా తగ్గిపోతాయి. గర్భవతులు సీతాఫలం తీసుకోవడం వలన కడుపులో ఉన్న బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్, నాడీ వ్యవస్థ జరుగుతుంది. అదేవిధంగా అధిక బరువు ఉన్నవారు ఈ ఫలాన్ని తీసుకోవడం వలన ఇంకాస్త బరువు పెరుగుతుంటారు.

కాబట్టి అధిక బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పండుని తీసుకోవద్దు. అలాగే ఈ పండును అధికంగా తీసుకోవడం వలన ప్రేగు సంబంధించిన ఇబ్బందులు అజీర్తి కడుపునొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉండడం ద్వారా అతిసారం కంటి సంబంధిత సమస్యలు కూడా ఎక్కువవుతాయి.

Also Read:  Food : చలికాలంలో అలాంటి ఆహార పదార్థాలు తింటున్నారా..? కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు మరెన్నో సమస్యలు..