Site icon HashtagU Telugu

Rusk: ఆ సమస్యలతో బాధపడుతున్న వారు రస్క్ తింటే ఆరోగ్యం రిస్క్ లో పడినట్టే?

Mixcollage 13 Dec 2023 06 08 Pm 8655

Mixcollage 13 Dec 2023 06 08 Pm 8655

మామూలుగా చాలామంది కాఫీ లేదా టీ తాగేటప్పుడు రస్క్ బిస్కెట్లను తింటూ ఉంటారు. ఇంకొందరు టీ, కాఫీలో కాకుండా అలాగే నేరుగా కూడా తింటూ ఉంటారు. ఈ రస్క్ తినడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు రస్క్ తింటే మాత్రం రిస్క్ తప్పదు అంటున్నారు వైద్యులు. ఈ రస్క్ తయారు చేసే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం నాసిరకం వస్తువులు వాడడం లాంటి కారణాలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని తీసుకోవడం వలన ఫుడ్ పాయిజనింగ్ అతి సారం, మలబద్దకం లాంటి సమస్యలు వస్తున్నాయట.

నిజానికి రస్కు తయారీకి ప్రధానం ముడి పదార్థం బొంబాయి రవ్వ లేదా మైదాపిండి ఎక్కువగా బొంబాయి రవ్వను తక్కువగా కలిపి బేకరీలో రస్క్ ని తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి రస్క్ తిన్నాక జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే శరీర బరువు పెరిగేందుకు కారణమవుతోంది. రస్క్ ఆ రంగు వచ్చేలా చేయడానికి క్యారమిల్ అనే ఫుడ్ కలర్ను వాడుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా చెడు చేస్తూ ఉంటుంది. రస్క్ ఎక్కువ కాలం నిలవ ఉండడానికి అందులో కొన్ని కెమికల్స్ ని కూడా వాడుతూ ఉంటారు. నాసిరకం నెయ్యి లేదా ఫామ్ ఆయిల్స్ ను వేస్తూ ఉంటారు. తక్కువ రకం ఆయిల్ తో తయారు చేసే రస్క్ ని తింటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.

గ్లుటన్ అనే రస్క్ లో ఎక్కువ మోతదులో ఉంటుంది. సెలియాక్ వ్యాదిగ్రస్తులు రస్క్ తింటే చిన్న ప్రేగులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. రస్క్ తీయగా ఉండడానికి దాన్లో రిఫైన్ షుగర్ ను ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. ఫుల్ గా షుగర్ ఉండే రస్క్ ను మితిమీరి తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికమవుతాయి. దాంతో డయాబెటిస్ సమస్య వస్తుంది. రస్క్ ను అధికంగా తీసుకున్న వాళ్లకి పెద్ద ప్రేగులో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అజిత్ గ్యాస్ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రెడ్ కంటే రస్కులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రస్కుని ఎక్కువగా తీసుకోవడమే పెద్ద సమస్య కాబట్టి వీటిని మితిమీరి తినకుండా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

Exit mobile version