Side Effects of Bhindi: 5 వ్యాధులున్న వాళ్ళు బెండకాయ తినకుంటే బెస్ట్

వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు పొరపాటున కూడా బెండకాయను తినొద్దు.

  • Written By:
  • Publish Date - February 2, 2023 / 05:40 PM IST

5 వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు పొరపాటున కూడా బెండకాయను తినొద్దు. దీంతో లాభాలకు బదులుగా నష్టాలు కలుగుతాయి. బెండకాయను పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ తినడానికి ఇష్టపడతారు. అయితే అది మన బాడీకి చలువ చేస్తుంది. కాబట్టి దీనిని వేసవిలో ఎంత ఎక్కువ తింటే అంత మంచిది.

◆ బెండకాయలో పోషకాలు

బెండకాయలో పోషకాలు కూడా బాగానే ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు A, C, E, K, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. , థయామిన్, నియాసిన్, ఫోలేట్, అమైనో ఆమ్లాలు మొదలైనవి కూడా ఉంటాయి.  దీనితో పాటు, బెండకాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ అల్సర్, యాంటీ క్యాన్సర్ మొదలైన లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

◆ బెండకాయ లాసెస్..

* బెండకాయ తినడం వల్ల కొన్ని వ్యాధులు ఉన్నవారి ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
* ముఖ్యంగా మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారికి ఇది కొత్త ప్రాబ్లమ్స్ సృష్టించే అవకాశం ఉంటుంది.

* బెండకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం సమస్య కూడా తలెత్తుతుంది.

* ఇప్పటికే గ్యాస్, ఉబ్బరం సమస్య ఉన్నవారు బెండకాయకు దూరంగా ఉంటే బెస్ట్.

* అధికంగా నూనెలో ఉడికిన బెండకాయను తింటే, అధిక కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంది.  తక్కువ నూనె , తక్కువ మసాలాలతో బెండకాయను ఉడికించి తింటే మంచిదే.

* జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు.. దగ్గు, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బెండకాయ తినడం మానుకోండి.

◆ బెండకాయ బెనిఫిట్స్

* మధుమేహ రోగులకు బెండకాయ చాలా మేలు చేస్తుంది.

* షుగర్ లెవల్ ను అదుపులో ఉంచడానికి బెండకాయ జ్యూస్ తాగుతారు.

*  కొలెస్ట్రాల్ స్థాయిని సాధారణ స్థాయికి బెండకాయ తీసుకొస్తుంది.

* బెండకాయ యాంటీ కార్సినోజెనిక్ మూలకం కావడంతో, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్‌ల ముప్పును తగ్గిస్తుంది.

*  ఇది కళ్లకు ఆరోగ్యకరం.

*  బరువు నుంచి రక్తపోటు వరకు కంట్రోల్ లో ఉండేలా హెల్ప్ చేస్తుంది.