Site icon HashtagU Telugu

Dandruff: వేసవిలో డాండ్రఫ్ సమస్య వేదిస్తోందా.. అయితే వెంటనే ఇలా చేయండి?

Dandruff

Dandruff

డాండ్రఫ్.. ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులను చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. అయితే డాండ్రఫ్ తగ్గడం కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు ఉపయోగించిన కూడా తగ్గదు. కొంతమంది హోమ్ రెమిడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎండాకాలంలో చెమట, దురద కారణంగా డాండ్రఫ్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఖరీదైన షాంపులతో పనిలేకుండా.ఈ ఇంటి చిట్కాలతో డాండ్రఫ్ సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డాండ్రఫ్ సమస్య పోవాలంటే మనం ఆయిల్ తో మొదలు పెట్టాలి. వారానికి ఒకసారి అయినా నూనెతో మసాజ్ చేయాలి. ఇలా ఆయిల్ మసాజ్ చేస్తూ ఉండటం వల్ల డాండ్రఫ్ సమస్య తగ్గుతుందట. అంతేకాకుండా హెయిర్ మంచిగా షైన్ అవుతుందట. ఇది జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుందట. ఆయిల్ తో మంచిగా మసాజ్ చేసిన తర్వాత షాంపూతో తల స్నానం చేసి కచ్చితంగా కండిషనర్ అప్లై చేయాలట. ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే డాండ్రఫ్ నుంచి రిలీఫ్ వస్తుందట. ఆయిల్ సాధారణంగా అప్లై చేయడం కాకుండా కుదుళ్ల వరకు బాగా పట్టించి మసాజ్ చేయాలట.

హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యను కూడా తగ్గించుకోవచ్చట. వారానికి ఒకటి లేదా రెండు సార్లు హెయిర్ మాస్క్‌ని ఉపయోగించాలట. ఆపై జుట్టును బాగా కడగాలని చెబుతున్నారు. కాగా తలస్నానం తర్వాత చాలా మంది జుట్టు ఆరపెట్టడానికి హెయిర్ డ్రయ్యర్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదట. మీరు డ్రైయర్ సహాయంతో మీ జుట్టును ఆరబెట్టినట్లయితే, అది చుండ్రు సమస్యను కూడా కలిగిస్తుందట. అటువంటి పరిస్థితిలో, చుండ్రు సమస్య తలెత్తకుండా సహజంగా జుట్టును ఆరబెట్టడం చాలా ముఖ్యం. అదే సమయంలో మీ జుట్టును స్టైల్ చేయడానికి తాపన సాధనాలను ఉపయోగించకూడదట. అప్పుడ సులభంగా డాండ్రఫ్ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.