Site icon HashtagU Telugu

Idly-Dosha: ఇడ్లీ దోస ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 20 Mar 2024 07 58 Pm 9734

Mixcollage 20 Mar 2024 07 58 Pm 9734

మనలో చాలామంది టిఫిన్ గా ఇడ్లీ దోసనే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇడ్లీ, దోశను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అయితే చాలామంది ప్రతి రోజు కూడా దోసెను అలాగే ఇడ్లీని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి జీర్ణశక్తిని పెంచి శరీరంలో రోగనిరోధకశక్తిని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. బియ్యం, మినప పప్పు నానబెట్టిన తర్వాత మిక్సీలో కానీ, గ్రైండర్ లోకానీ వేసి పిండిని తయారు చేస్తారు. వీటితో ఎన్నిరకాల పదార్థాలైనా చేసుకోవచ్చు. దీనిలో ప్రొబయెటిక్స్, బతికున్న బ్యాక్టీరియా ఉండి పేగు ఆరోగ్యాన్ని బాగుచేస్తాయి.

వైద్యులు మాత్రం పులియబెట్టిన పదార్థాలను ఉదయం లేదంటే మధ్యాహ్నం మాత్రమే తినాలి. రాత్రి వేళ తింటే డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. పులిసిన ఆహారం తినడం వల్ల కడుపులో వేడి పెరుగుతుంది. దీనివల్ల రాత్రిపూట నిద్రకు భంగం కలుగుతుంది. మరికొందరికి కడుపులో అనీజీగా ఉండటంతో పాటు బ్లోటింగ్ సమస్యలు వస్తాయి. నిద్రించే సమయానికి ముందు ఈ తరహా ఆహార పదార్థాలను తినకూడదు. పులిసిన ఆహారాలు అందరికీ పడకపోవచ్చు. కొంతమందికి రియాక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.

పులిసిన వాటిల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. పులిసిన పదార్థాలు తిన్నవెంటనే కడుపునొప్పి వస్తే వాటిగురించి ఆలోచించాలి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది.