Cold Water Drinking: కూల్ వాట‌ర్ తెగ తాగేస్తున్నారా..? అయితే ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

  • Written By:
  • Publish Date - May 27, 2024 / 06:00 AM IST

Cold Water Drinking: ఈ వేసవిలో వేడి నిరంతరం పెరుగుతోంది. ఒకవైపు వేడిగాలులు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు మండుతున్న ఎండలు కూడా ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది చల్లని నీరు తాగుతుంటారు. ముఖ్యంగా బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు రిఫ్రిజిరేటర్‌లో నీళ్లు (Cold Water Drinking) తాగడానికి ఇష్టపడతాం. కానీ మీ ఈ అలవాటు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా మీరు తీవ్రమైన వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో చల్లటి నీటిని నిరంతరం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె వ్యాధి

నిరంతరం చల్లటి నీటిని తాగడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, దీని కారణంగా హృదయ స్పందన మందగించడం ప్రారంభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యాల్లోనే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

మెదడును ప్రభావితం చేయవచ్చు

మీరు చాలా చల్లని నీరు త్రాగితే అది మెదడు నరాలపై ప్రభావం చూపుతుంది. నిజానికి శరీరంలో జలుబు పెరగడం వల్ల మెదడులోని నరాలు సరిగా పనిచేయలేకపోవడం వల్ల మెదడు పనిచేయడం మానేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే శక్తి కూడా తగ్గిపోవచ్చు.

Also Read: Elinati Shani : జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా ?

సైనస్

శరీరంలో చల్లదనం పెరగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల సైనస్ వస్తుంది. సైనస్ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా చల్లని నీరు తాగకూడదు. చ‌ల్ల‌టి నీరు తాగితే వారి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.

We’re now on WhatsApp : Click to Join

కుండ‌లో వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగే బదులు కుండలోని నీటిని కూడా తాగవచ్చు. కుండలోని నీరు శరీరంలోని అనేక మలినాలను తొలగిస్తుంది. కుండ‌లో నీటిని తాగడం వల్ల శరీరంలో పిహెచ్ లెవెల్ మెయింటెయిన్ అవుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. వాస్తవానికి మట్టి కుండ‌లో అధిక మొత్తంలో సహజ లక్షణాలు ఉన్నాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం, కడుపు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేసవిలో పాట్ వాటర్ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇది తలనొప్పి సమస్యను కూడా నివారిస్తుంది.