ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ లేదా మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ అనేవి హార్మోన్లతో కూడిన మాత్రలు. వీటిని అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత 1 గంట నుండి 72 గంటలలోపు తీసుకోవాలి.

Published By: HashtagU Telugu Desk
I-Pill Side Effects

I-Pill Side Effects

I-Pill Side Effects: అవాంఛిత గర్భధారణను నివారించడానికి అమ్మాయిలు సాధారణంగా ‘ఐ-పిల్’ వాడుతుంటారు. దీనిని ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అని కూడా పిలుస్తారు. సురక్షితం కాని సెక్స్ జరిగిన 72 గంటలలోపు దీనిని తీసుకోవాలి. అయితే చాలామంది అమ్మాయిలు దీనిని అలవాటుగా మార్చుకుంటున్నారు. వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి చొప్పున దీనిని వాడుతున్నారు. కానీ ఈ మాత్రలు చాక్లెట్లు కావు అని వీటిని తరచుగా వాడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐ-పిల్ అలవాటుగా మారితే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకోండి.

ఐ-పిల్ ప్రతిరోజూ తీసుకోవచ్చా?

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ లేదా మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ అనేవి హార్మోన్లతో కూడిన మాత్రలు. వీటిని అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత 1 గంట నుండి 72 గంటలలోపు తీసుకోవాలి. కానీ వీటిని ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువ అస్సలు వాడకూడదు. ఒకవేళ వీటిని తరచుగా తీసుకుంటే పీరియడ్స్ అస్తవ్యస్తం అవుతాయి. భవిష్యత్తులో గర్భం దాల్చడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ మాత్రల అతిగా వాడకం ఓవ్యులేషన్ (అండం విడుదలయ్యే ప్రక్రియ)పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పీరియడ్స్ సమయానికి రావు. ఫెలోపియన్ ట్యూబ్ అండాన్ని సరిగ్గా పట్టుకోలేదు. ఫలితంగా ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది.

Also Read: పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

ఐ-పిల్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

బ్లీడింగ్: ఐ-పిల్ తీసుకున్న తర్వాత రక్తస్రావం కావచ్చు. ఇది కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

నొప్పులు: రొమ్ములలో నొప్పి, నడుము నొప్పి, శరీరం మొత్తం విరిగిపోయినట్లుగా అనిపిస్తుంది.

అలసట: విపరీతమైన నీరసం, అలసట, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కడుపు నొప్పి: కడుపులో భరించలేనంత నొప్పి రావడం, వాంతులు అయ్యే అవకాశం ఉంది.

క్రమహీన పీరియడ్స్: ఐ-పిల్ వాడిన తర్వాత చాలా నెలల వరకు పీరియడ్స్ సమయానికి రాకపోవచ్చు.

వంధ్యత్వ సమస్యలు: భవిష్యత్తులో పిల్లలు కలగడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

  Last Updated: 14 Feb 2026, 05:00 PM IST