Iron Supplements : ఐరన్ సప్లిమెంట్స్ అతిగా వాడితే ఆ ప్రాబ్లమ్స్

Iron Supplements : మీరు ఐరన్‌ను సప్లిమెంట్ మాత్రలను కంటిన్యూగా వాడేస్తున్నారా ?

Published By: HashtagU Telugu Desk
Iron Supplements

Iron Supplements

Iron Supplements : మీరు ఐరన్‌ను సప్లిమెంట్ మాత్రలను కంటిన్యూగా వాడేస్తున్నారా ? వాటిని అతిగా వాడితే టైప్‌-2 డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌ సమస్యలు ముసురుకునే ముప్పు ఉంటుందని  జాతీయ పోషకాహార సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిమితికి మించకుండా కొద్దికాలంపాటు ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఒకవేళ ప్రతిరోజు 5 నుంచి 20 ఎంజీకి మించి ఐరన్ సప్లిమెంట్లను వాడిన వారిలో టైప్‌-2 డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌ వంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా దేశవిదేశాల్లోని 3.2 లక్షల మందిని, 28,837 కేస్‌ స్టడీలను పరిశీలించారు. వయసు, లింగం, బీఎంఐ, హైపర్‌ టెన్షన జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సుదీర్ఘకాలంపాటు అధ్యయనం నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఐరన్‌ను సప్లిమెంట్ల రూపంలో(Iron Supplements) తీసుకోవడం కంటే ఐరన్‌ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదని జాతీయ పోషకాహార సంస్థ స్టడీ రిపోర్ట్ సూచించింది. ఐరన్‌ సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో రసాయనిక అవశేషాలు చేరవని, ఫలితంగా జీవక్రియలు సజావుగా సాగుతాయని తెలిపింది. ఈ అధ్యయనం కోసం ఐరన్‌ సప్లిమెంట్ మాత్రలను తీసుకుంటున్నవారి ఆహారపు అలవాట్లను, తీసుకోని వారి ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకున్నారు.  ఐరన్‌ను సప్లిమెంట్ల ద్వారా తీసుకునే వారితో పోలిస్తే.. తీసుకోని వారిలో డయాబెటిస్‌ మిల్లిటస్‌ (డీఎం) తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. హైపర్‌ టెన్షన్‌ లక్షణాలు కూడా వారిలో లేవని గుర్తించారు.

Also Read: Kavitha – Ram Mandir : అయోధ్య రామమందిరంపై కవిత ట్వీట్ వైరల్

ఐరన్‌ లభించేవి ఇవీ.. 

కందగడ్డ, పాలకూర, బఠానీలు, బ్రకోలి, స్ట్రింగ్‌ బీన్స్‌, సోయాబీన్స్‌, గుమ్మడి గింజలు, క్వినోవా, మేక,పొట్టేలు మాంసం, చికెన్‌, లివర్‌, రొయ్యలు, గుడ్లు, చేపలు, టర్కీ, ట్యూనా మొదలైన వాటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

  Last Updated: 11 Dec 2023, 11:04 AM IST