Site icon HashtagU Telugu

Summer Fruits: సమ్మర్ లో డీహైడ్రేషన్ నివారించాలంటే ఈ 6 రకాల ఫ్రూట్స్ ని తినాల్సిందే!

Summer Fruits

Summer Fruits

వేసవికాలం వచ్చింది అంటే విపరీతమైన ఎండల కారణంగా ప్రజలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వేసవిలో అధిక చెమట,డిహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, అలసట వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక డిహైడ్రేట్ గా ఉండటం కోసం వైద్యులు తగినంత నీరు తాగాలని చెబుతూ ఉంటారు. అధిక చెమట పట్టేవారికి మామూలు నీటి కంటే ఇంకా ఎక్కువ నీటిని తాగాలని చెబుతూ ఉంటారు.. అయితే కేవలం నీరు మాత్రమే కాకుండా హైడ్రేడింగ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలని చెబుతున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు చేర్చుకోవడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంతకీ ఆ పండ్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆపిల్.. ఇందులో దాదాపు 80 శాతం నీరు ఉంటుంది. అలాగే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుందట. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

టమాటా.. అలాగే ఇందులో కూడా దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. దీనిని సాధారణంగా కూరలో ఉపయోగిస్తారు. టొమాటోలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందట. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుందని చెబుతున్నారు.

దోసకాయ.. దోసకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇందులో దాదాపుగా 90 శాతం నీరు ఉంటుంది.అలాగే ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది హీట్‌స్ట్రోక్‌ ను నివారించగలదట. దోసకాయ మెదడుకు కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. దోసకాయలో ఫిసెటిన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్ ఉంటుంది. ఇది మెదడు మెరుగైన పనితీరుకు తోడ్పడుతుందట.

వేసవికాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన వాటిలో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది హీట్‌స్ట్రోక్‌ తో పోరాడడంలో సహాయపడుతుంది. అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ పండు గుండె జబ్బులను నివారించడంలో కూడా సహాయపడుతుందట.

స్ట్రాబెర్రీలలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. వీటిలో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలతో పోరాడడంలో సహాయపడతాయని చెబుతున్నారు.

పుట్టగొడుగులు… అలాగే ఇందులో విటమిన్లు బి2, డి వంటి పోషకాలకు మంచి మూలం. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. మీరు ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తినవచ్చట.. ఇది అలసటను తగ్గించడంలో సహాయపడుతుందని, అలాగే వేసవికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.