Covid Cases Rise : హైద‌రాబాద్లో మ‌ళ్లీ కోవిడ్ విజృంభ‌ణ‌

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 04:45 PM IST

హైద‌రాబాద్ లో కోవిడ్ కేసులు గ‌త ప‌ది రోజుల నుంచి రెట్టింపు అయ్యాయి. గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌డం డేంజ‌ర్ బెల్ మోగుతోంది. జూన్ 15న 132గా ఉన్న ఈ సంఖ్య జూన్ 22వ తేదీ నాటికి 292కి చేరుకుంది. అదే సమయంలో తెలంగాణలో రోజువారీ కౌంట్ 205 నుంచి 434కి పెరిగింది. మరణాలు సంభవించనప్పటికీ క్రియాశీల కేసుల సంఖ్య 1401 నుండి 2680కి పెరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో 292 కేసులు నమోదుకాగా, అంతకుముందు రోజు 240 కేసులు నమోదు కావ‌డం మ‌రోసారి కోవిడ్ డేంజ‌ర్ బెల్ మోగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో, అంటువ్యాధుల సంఖ్య 11 నుండి 28 కి పెరిగింది.

ప్రభుత్వం మార్గదర్శకాలు
తెలంగాణ ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త తాజాగా కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందని భ‌రోసా ఇచ్చారు. రెండు డోస్‌లు తీసుకోవడం ద్వారా టీకాను పూర్తి చేయడం చాలా ముఖ్యమ‌ని ఆయన అన్నారు.