Beauty Parlour కు వెళ్తున్నారా..జాగ్రత్త ముందే మీ జుట్టును చూసుకోండి..తర్వాత ఏమి ఉండదు

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు ఉంది హైదరాబాద్ లో మహిళ

  • Written By:
  • Updated On - August 3, 2023 / 12:46 PM IST

ఇటీవల కాలంలో మహిళలు బ్యూటీ పార్లర్ (Beauty parlor) కు బాగా అలవాటుపడ్డారు. చేతి గోర్లు తీయించుకునే దగ్గరి నుండి ఉన్న జుట్టును కట్ చేయించుకొని వరకు అన్ని బ్యూటీ పార్లర్ లోనే చేయించుకుంటున్నారు. ఇలా బ్యూటీ పార్లర్ లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుండడం తో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆన్లైన్ లో కోర్స్ లు నేర్చుకొని చాలామంది బ్యూటీ పార్లర్ షాప్స్ పెడుతున్నారు. రకరకాల ఆఫర్లతో మహిళలను ఆకర్షిస్తున్నారు. అంతే కాదు ఇలా చేస్తే జుట్టు పెరుగుతుందని..ఇలా వాడితే మీ పేస్ హీరోయిన్ పేస్ ల మారుతుందని చెపుతూ మహిళలు , యువతుల నుండి భారీగా డబ్బు లాగేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది.

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు ఉంది హైదరాబాద్ (Hyderabad) లో మహిళ అందం కోసం చేసిన ప్రయత్నం. తనను మోడల్ గా చూడాలని భర్త కోరికను తీర్చాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. భర్త ముందు కాదుకదా నలుగురు ముందుకు కూడా రాలేని పరిస్థితికి తీసుకొచ్చింది బ్యూటీ పార్లర్ బ్యూటిషన్. పాతబస్తీకి చెందిన ఓ మహిళ..తనను మోడల్‌గా చూడాలనుకుంటున్న భర్త కోరికను తీర్చడం కోసం అబిడ్స్‌లోని బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది.

తనను మోడల్ గా చేయాలనీ..తనను మోడల్ (model) గా చూడాలని నా భర్త కోరిక అని బ్యూటిషియన్ కి చెప్పింది. ఓ..అలాగే..మీరు ఖచ్చితంగా మోడల్ గా అవుతారు. కాకపోతే ఆలా కావడానికి మీము చెప్పింది చేయాలనీ సూచించారు. దానికి సరే అన్నది. బ్యూటిషియన్ చెప్పినట్లు పొడుగ్గా ఉన్న హెయిర్‌ని కట్ చేయించుకుంది. ఆ తర్వాత బ్యూటీషియన్ హెయిర్ ఆయిల్ పెట్టింది. ఆలా పెడుతున్న కొద్దీ జుట్టు రాలడం మొదలైంది. అది కూడా కొద్దిగా కొద్దిగా కాదు..భారీగా జుట్టు ఊడిపోవడం మొదలైంది. జుట్టు అంత ఉడుతుండడం తో షాక్ తిన్న సదరు మహిళ.. ఇంటికి పరుగులు తీసింది. భార్య హెయిర్ ఊడిపోవడం చూసి భర్త షాక్‌కి గురయ్యాడు. ఇద్దరు కలిసి బ్యూటీ పార్లర్ కు వెళ్లి గొడవ పడ్డారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగింది చెప్పి ..బ్యూటీ పార్లర్ ఫై కేసు పెట్టారు. పోలీసులు విచారణ కు వెళ్లగా సదరు నిర్వాహుకులు షాప్ క్లోజ్ చేసే వెళ్లిపోయారు. ప్రస్తుతం వారిపై దర్యాప్తు చేస్తున్నారు. అందుకే బ్యూటీ పార్లర్ కు వెళ్లేవారు కాస్త జాగ్రత్త..లేనివాటికోసం తపిస్తే ఉన్నాయి ఉడుతాయి.

Read also : Telangana : తెలంగాణ కాంగ్రెస్ లో పెరుగుతున్న జోష్