Site icon HashtagU Telugu

Norovirus : హైద‌రాబాద్ లో ప్రాణాంత‌క‌ నోరోవైర‌స్

హైద‌రాబాద్ చిన్నారుల్లో ప్రాణాంత‌క నోరో వైర‌స్ బ‌య‌ట ప‌డింది. ఆ విష‌యాన్ని గాంధీ ఆస్ప‌త్రి, ఎల్లా ఫౌండేష‌న్ కు చెందిన ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. దీంతో ఒక్క‌సారిగా పేరెంట్స్ లో క‌ల‌వ‌రం మొద‌లైయింది. కరోనా వైరస్ మరో విడత వస్తుందేమోనన్న భయం ప్రజల్లో ఉంటే, ఇంకో వైపు హైదరాబాద్ లో నోరోవైరస్ కేసులు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. ఐదేళ్లలోపు ఐదుగురు చిన్నారుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. గాంధీ ఆసుపత్రి, ఎల్లా ఫౌండేషన్ కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
హైద‌రాబాద్ లోని 458 మంది చిన్నారుల నుంచి మైక్రోబయాలజిస్ట్ లు ర‌క్త‌, మ‌ల‌, మూత్ర న‌మూనాల‌ను సేకరించి ప‌రీక్షించగా నోరో వైరస్ బ‌య‌ట ప‌డింది. ఐదుగురు చిన్నారుల‌కు భ‌యంక‌ర‌మైన నోరో వైర‌స్ ఉంద‌ని కొనుగొన్నారు. ఈ నోరోవైరస్ చిన్నారుల‌తో పాటు అన్ని వయసుల వారిలోనూ డయేరియా (అతిసారం)కు దారితీస్తుంది.
నోరో వైరస్ లక్షణాలు
వాంతులు, నీళ్ల విరేచనాలు కనిపిస్తాయి. డీహైడ్రేషన్ కు గురి అవుతారు. ఉన్నట్టుండి నీరసపడిపోతారు. వళ్లు కొంచెం వెచ్చపడుతుంది. కడుపులో నొప్పి రావచ్చు. ప్రధానంగా వాంతులు, విరేచనాలతో వారి శరీంలోని నీటి శాతం, లవణాల శాతం తగ్గిపోతుంది. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు రిస్క్ ఏర్పడొచ్చు.
ఏం చేయాలి..?
తగినంత విశ్రాంతి ఇవ్వాలి. శిశువులు అయితే పాలు ఇవ్వడం ఆపకూడదు. ద్రవ పదార్థాలు తగినంత ఇస్తూ ఉండాలి. గదిలో వేడి వాతావరణం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఒకటి రెండు విరేచనాలు, వాంతులకు కంగారు పడిపోనక్కర్లేదు. అవి కంట్రోల్ కాకపోతే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.