వేసవికాలం వచ్చింది అంటే చాలు సీజనల్ ఫ్రూట్స్ మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిలో తాటి ముంజలు కూడా ఒకటి. తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలకు ఇవి చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి. ఈ కాలంలో తాటి ముంజలు తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. మరి వేసవిలో తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తాటి ముంజలలో మన శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో చెమటతో త్వరగా డిహైడ్రేషన్ అయ్యేవారికి తాటి ముంజలు శరీరం హైడ్రేట్ అయ్యేలా చేస్తాయట.
వర్క్ రీత్యా ఎక్కువగా బయట గడిపేవారు రోజుకు బాడీకి సరిపోయేంత మంచి నీరు తాగకపోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి. ఈ సమస్య ఉన్నవాళ్ళకు కూడా తాటి ముంజలు తినవచ్చని చెబుతున్నారు. అలాగే కడుపులో మంట, మూత్ర విసర్జన సమయంలో పొత్తికడుపులో భరించలేని నొప్పితో బాద పడేవారు క్రమం తప్పకుండా ఒక పదిహేను రోజులు పాటు లేత ముంజలను తినాలట. ఇక తాటి ముంజలలో శరీరానికి కావాల్సిన ఏ, బీ, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. తాటి ముంజలు మన శరీర బరువు తగ్గటానికి ఎంతగానో దోహదం చేస్తాయని చెబుతున్నారు.
అలాగే తాటి ముంజలు కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయట. ఈ ముంజలలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగిస్తుందట. మీ వడదెబ్బ తగిలిన వారికి తాటి ముంజలను కొన్ని తినిపించడం వల్ల తొందరగా బయట పడతారని చెబుతున్నారు. జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు. తాటి ముంజలు మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చి అలసటను తగ్గిస్తాయట. ఇక ఎండాకాలంలో చాలా వేడి చేసి ఇబ్బంది పడే వారు తాటి ముంజలను తింటే శరీరం చల్లబడుతుందట. శరీరానికి చలువ చేకూర్చే తాటి ముంజలను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. కాగా తాటి ముంజలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయట. శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయట. వేసవి కాలంలో మన శరీరం నుండి చెమట బయటకు పోతుంది. శరీరంలోని పోషకాలు చెమట రూపంలో బయటకు పోతాయి. వాటిని భర్తీ చేయటానికి తాటి ముంజలు ఎంతో అవసరం అని చెబుతున్నారు.