Weight Loss: సులువుగా బరువు తగ్గాలి అంటే ఈ చిన్న చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు, ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొందరు విపరీతమైన బరువు పెరిగి అందవిహినం

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 09:30 AM IST

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు, ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొందరు విపరీతమైన బరువు పెరిగి అందవిహినంగా కనిపిస్తూ ఉంటారు. కొందరు వారి సొంత పనులు వారు చేసుకోవడానికి కూడా వీలు లేక ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు. ఇలా అధిక బరువు ఉండేవారు తరచూ అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాగే ఇక అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

జిమ్ కి వెళ్లడం, ఎక్సర్సైజ్ చేయడం, డైట్ ఫాలో అవ్వడం ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అలాంటి ప్రయత్నాలు చేసి అలసిపోయారా. మరి సులువుగా బరువు తగ్గాలి అంటే ఏం చేయాలో, అందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు ఉదయంపూట నిద్ర లేవగానే వేడి నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. దీనివల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. జీవక్రియ మెరుగవడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ 2 కప్పుల గోరువెచ్చని నీటిని తాగితే శరీరం ఎప్పుడూ శక్తివంతంగా ఉంటుంది.

తేనెతో కలిపిన గోరువెచ్చని నీటిని కూడా తాగవచ్చు. ఇలా చేస్తే మలవిసర్జన కూడా సాఫీగా జరుగుతుంది. అలాగే బరువు తగ్గాలంటే రోజులో మొదటి భోజనంతోనే ప్రారంభించాలి. ఆరోగ్యాన్నిచ్చేవి మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండేవి తీసుకోవాలి. గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, మొలకలు, పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల రసాలను మీ డైట్ లో చేర్చుకోవాలి. అదేవిధంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత వాకింగ్, జాగింగ్, యోగా, జిమ్ లాంటివి చేయాలి. దీనివల్ల బరువు సులభగా తగ్గుతారు. జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో నీటికొరత ఏర్పడితే మన జీవక్రియపై ప్రభావం పడుతుంది. మనిషి శరీరంలో ఎక్కువ భాగం నీటితోనే తయారవుతుంది. శరీరం హైడ్రేట్ గా ఉండకపోతే శరీన పనితీరులో సమస్యలు తలెత్తుతాయి. బరువు తగ్గడం కూడా సులభంగా జరగదు. ఈ చిట్కాలు పాటిస్తే చాలు ఈజీగా బరువు తగ్గవచ్చు.