Site icon HashtagU Telugu

Rice: ఏంటి ప్రతిరోజు మనం తినే అన్నంతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చా.. అదెలా అంటే?

Rice

Rice

ప్రస్తుత రోజుల్లో చాలామంది అందం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా అందం కోసం నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా ముఖంపై ఉన్నటువంటి నల్లటి మచ్చలు మురికిని తొలగించడం కోసం ఎన్నెన్నో బ్యూటీ ప్రాడెక్టులు నేచురల్ రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే మనం తినే అన్నం తోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..బియ్యం కడిగిన నీళ్లు చర్మానికి ఎంత మేలు చేస్తుందో ఉడకబెట్టిన అన్నం నుంచి తయారు చేసే పేస్టు నుంచి అదే ప్రయోజనాలు లభిస్తాయట. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని డిటాక్సిఫై చేస్తాయట. మొటిమలు, వాపుల్ని కూడా తగ్గిస్తాయట. చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలు, ఫైన్‌ లైన్‌ లను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.

ఉడికించిన అన్నం 1 గిన్నె,పసుపు 1/2 టీస్పూన్,కలబంద జెల్ 1 గిన్నె తీసుకోవాలి. అయితే ఇందుకోసం ముందుగా మిక్సర్ తీసుకుని అందులో ఉడికించిన అన్నం, పసుపు, కలబంద వేసి బాగా కలపాలి. నిమిషాల వ్యవధిలో ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ పేస్టును ముఖంపై జెల్లీ లాగా అప్లై చేసి మసాజ్ చేసి స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత ఫేస్ ప్యాక్‌ ని ముఖం మీద 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత చేతులతో ఫేస్ ప్యాక్‌ ని తొలగించి, సాధారణ నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే వెంటనే మీ ముఖంలో మంచి గ్లో కనిపిస్తుంది. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

అలాగే కలబందను కట్ చేసి దాని నుంచి జెల్ తీసి డైరెక్ట్‌గా ముఖంపై అప్లై చేసుకోవచ్చట. దాని నుండి తీసిన జెల్‌ ను నేరుగా ముఖంపై అప్లై చేయవచ్చట. అలోవెరా జెల్‌ లో తేనె, నిమ్మరసం లేదా ముల్తానీ మట్టిని కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. మార్కెట్లో లభించే క్రీమ్, లోషన్, సీరమ్ వంటి కలబందతో తయారు చేసిన సహజ ఉత్పత్తులను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. కాగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారిస్తుందట. చర్మం ముడతలు పడకుండా కలబంద నివారిస్తుందని చెబుతున్నారు. కలబందను రోజూ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారి మీ అందం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు.