Mint Leaves: పుదీనా ఆకుల వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

ఆకుకూరల్లో ఒక్కటైన పుదీనా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పుదీనా మొక్కకు చావు ఉండదని అంటుంటారు. అయితే పుదీనాను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు.

  • Written By:
  • Updated On - July 20, 2024 / 05:23 PM IST

ఆకుకూరల్లో ఒక్కటైన పుదీనా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పుదీనా మొక్కకు చావు ఉండదని అంటుంటారు. అయితే పుదీనాను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవిలో పుదీనాను బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనిలో చలువ చేసే గుణం ఉంటుంది. ఇది మండుతున్న ఎండలకు మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయ పడుతుంది. అంతేకాకుండా పుదీనా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే ఆడవాళ్లు దీన్ని ఇంటి పనుల కోసం కూడా ఉపయోగించొచ్చు.

అవును పుదీనాతో ఎన్నో ఇంటి పనులను కంప్లీట్ చేయవచ్చట. మరి పుదీనా వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవి కాలంలో ఇంట్లో ఈగలు దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి పుదీనా ఆకులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి క్రిమిసంహారక మందుగా వాడ వాడ వాడాలి. అలాగే వంటగదిలో ఉంచిన డస్ట్ బిన్ లో దుమ్ము వల్ల ఇంట్లోకి చిన్న చిన్న కీటకాల రావడం మొదలవుతుంది. దీని వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ కీటకాలను తరిమికొట్టడంలో పుదీనా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా పుదీనా ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దానిని వడకట్టి వెనిగర్ లేదంటే బేకింగ్ సోడాను కలిపి డస్ట్ బిన్ పై స్ప్రే చేయడం వల్ల డస్ట్ బిన్ కు అంటుకున్న కీటకాలన్నీ తొలగిపోతాయి. వాతావరణం కారణంగా మొక్కలకు కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మొక్కలు సరిగ్గా ఉండవు. పూత, కాత కూడా సరిగ్గా ఉండదు. అయితే వీటిని మీ,రు రసాయన పురుగుమందు స్ప్రేకు బదులుగా సహజసిద్ధంగా ఇంట్లో తయారు చేసిన స్ప్రేతో తరిమికొట్టవచ్చు. ఇందుకోసం పుదీనా ఆకులను మిక్సీలో వేసి ఒక కప్పు నీళ్లు, బేకింగ్ సోడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిని జల్లెడలో వడగట్టి స్ప్రే బాటిల్ లో నింపి మొక్కలపై పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ఘాటుకి చిన్న చిన్న పురుగులు లాంటివి చనిపోతాయి.

Follow us