ఈ రోజుల్లో జుట్టు రాలడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఏం జుట్టు రాలే సమస్యలు తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల హెయిర్ ఆయిల్స్ షాంపూలు వంటివి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. అయితే మరి ఏం చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుందో అలాగే జుట్టు పెరగడం మొదలవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం నిమ్మరసం ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి నిమ్మతో జుట్టు రాలడం ఎలా అరికట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, సిట్రిక్ యాసిడ్ వంటి గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయట. నిమ్మరసంలో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయట ఇవి స్కాల్ప్ ని క్లెన్స్ చేసి బ్యాక్టీరియా, దుమ్ము, ఎక్కువగా ఉండే నూనెని దూరం చేస్తుందట. దీంతో జుట్టు పొడవుగా పెరుగుతుందని,దీని వల్ల హెయిర్ ఫోలికల్స్ బలంగా మారతాయని చెబుతున్నారు. అలాగే నిమ్మకాయలో ఎసిడిటీ గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లడ్ సర్క్యూలేషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయట. దీనికోసం నిమ్మరసాన్ని అప్లై చేసి మసాజ్ చేయాలని చెబుతున్నారు. దీని వల్ల సర్క్యూలేషన్ పెరిగి, పోషకాలు అంది హెయిర్ ఫోలికల్స్ స్ట్రాంగ్ మారతాయట.
దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట. దీనిని తలకి ముఖ్యంగా స్కాల్ప్ కి రాసి ఫింగర్ టిప్స్ తో 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలని చెబుతున్నారు. అలాగే నిమ్మలో అసిడిక్ గుణం ఉంటుంది, దీని వల్ల పీహెచ్ వెల్స్ బ్యాలెన్స్ అవుతుందట. ఇది జిడ్డు తనాన్ని దూరం చేసి స్కాల్ప్ డ్రైగా ఉండేలా చేస్తుందట. దీంతో జుట్టు పెరుగుతుందని దీంతో నేచురల్ ఆయిల్స్ బ్యాలెన్స్‌గా ఉండేలా చేస్తాయి. ఇవన్నీ కూడా జుట్టుని హెల్దీగా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతాయట. అదేవిధంగా నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ప్రొడక్షన్‌ని సపోర్ట్ చేస్తుందట.
దీని వల్ల కుదుళ్లు బలంగా మారతాయని,దీంతో జుట్టు రాలడం తగ్గి బలంగా మారుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ముందుగా నిమ్మరసంలో ఎక్కువగా అసిడిక్ ఉంటుంది. దీనిని నేరుగా తలకి రాస్తే ఇరిటేషన్ ఉంటుందట. అయితే ఈ ఇరిటేషన్ రాకుండా ఉండేందుకు నిమ్మరసాన్ని నీటితో లేదా కొబ్బరి నూనె, తేనె వంటి వాటితో 1: 2 భాగంలో మిక్స్ చేసి అప్లై చేయాలని చెబుతున్నారు. ఇలా తలకి రాసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే ఉండాలట. అంతకు మించి ఉండకూడదట. ఎందుకంటే నిమ్మలోని ఇందులో అసిడిక్ గుణాల కారణంగా ఇది ఎక్కువసేపు ఉండడం వల్ల స్కాల్ప్ మరింత డ్రైగా మారి ఇరిటేషన్ వస్తుందట. మసాజ్ తర్వాత జుట్టుని గోరువెచ్చని నీటితో కడగాలని, వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు పెరగడం మొదలవుతుందట.