జీలకర్ర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మసాలా దినుసులలో ఒకటైన జీలకర్ర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. జీలకర్రను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూరకు రుచిని వినిపించడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అలాగే బరువు తగ్గడానికి జీలకర్ర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి బరువు తగ్గడానికి జీలకర్రను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీలకర్రలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.
దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుందట. కాగా బరువు తగ్గడానికి మీరు రోజుకు రెండు పూటలా జీలకర్రను తీసుకోవాలి. ఇందుకోసం మీ రోజువారి ఆహారంలో జీలకర్రను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చట. జీలకర్ర నీరు కూడా మీరు బరువు తగ్గడానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుందట. బరువు తగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలట. ఉదయాన్నే కాసేపు మరిగించి చల్లారిన తర్వాత తాగాలట. అలాగే మిగిలిన జీలకర్రను నమిలి తినాలట. జీలకర్ర ను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.
జీలకర్ర వాటర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుందట. జీలకర్రను తిన్నా ఈ వాటర్ ను తాగినా మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుందట. దీనిలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయట. అంతేకాకుండా ఇది మీ శరీరానికి ఎనర్జీ కూడా అందుతుందట. జీలకర్రను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కూడా అవుతాయట. అందుకే ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో సహాయపడుతుందట. దీని వల్ల శరీరంలోని కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చట. అలాగే ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందట. జీలకర్రను తినడం వల్ల మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి ఉదర సమస్యలు కూడా తగ్గిపోతాయట. ఇది పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుందట. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందనీ చెబుతున్నారు.