Site icon HashtagU Telugu

Hair Growth Tips: అల్లంలో ఈ నూనె కలిపి రాస్తే చాలు.. జుట్టు గడ్డిలా పెరగాల్సిందే?

hiar growth

hiar growth

ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ హెయిర్ ఫాల్ సమస్య కారణంగా చాలామంది పురుషులు, స్త్రీలు పలుచని జుట్టు బట్టదల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఆయిల్స్ ని ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు అందుబాటులో ఉండే వాటితోనే ఈ హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం అల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

మరి అల్లం ఉపయోగించి జుట్టును ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో అల్లం తప్పకుండా ఉంటుంది. చాలా రకాల వంటల్లో అల్లం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అల్లం కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా కాపాడుతుందని చెబుతున్నారు. అల్లంని తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల అందులో ఉండే యాంటీ ఫంగల్,యాంటీ యాక్సిడెంట్ యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ జుట్టును స్కాల్ప్‌ని హెల్దీగా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ సి, మినరల్స్ అన్నీ కూడా స్కాల్ప్ ఇరిటేషన్‌ని దూరం చేసి జుట్టు పెరుగుదలకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ అల్లం పౌడర్, ఒక టేబుల్ స్పూన్ జొజొబా ఆయిల్ ని తీసుకోవాలి.

తర్వాత జొజొబా ఆయిల్, అల్లం పొడిని కలిపి పేస్టులా చేయాలి..దీనిని తీసుకుని స్కాల్ప్‌పై అప్లై చేసి సర్క్యూలర్ మోషన్‌లో మసాజ్ చేయాలి.
30 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత సల్ఫేట్ ఫ్రీ షాంపూతో తలస్నానం చేసి కండీషనర్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గిపోయే జుట్టు ఒత్తుగా గడ్డిలా గుబురుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కారణంగా కూడా అధికంగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. మరి చుండ్రు సమస్య ఉండకూడదు అనుకున్న వారు మూడు లేదా నాలుగు చుక్కల పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్, 2 టేబుల్ కొబ్బరి నూనె లేదా , ఆముదం ఇలా ఏదైనా తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. అయితే ముందుగా పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్, అల్లం పొడి, నూనె, నిమ్మరసం తీసుకుని పేస్టులా కలపాలి..ఈ పేస్టుని స్కాల్ప్‌పై అప్లై చేయాలి. తర్వాత షవర్ క్యాప్ వేసుకుని అరగంట వరకూ ఉండాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి కుదుళ్లు బలంగా మారుతాయి. అలాగే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది.

Exit mobile version