Coconut Oil: చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనె (Coconut Oil) అనేక చర్మ సమస్యలకు పరిష్కారం చూపగలదు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. జుట్టు విషయంలోనైనా, చర్మం విషయంలోనైనా కొబ్బరి నూనె ఒక సహజ సిద్ధమైన పదార్థం. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా లోతుగా పోషణను అందిస్తుంది. ఇది చర్మానికి, వెంట్రుకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను చర్మానికి లేదా జుట్టుకు రాసుకుంటే మీకు ఈ అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.
చర్మం, జుట్టుకు ప్రయోజనాలు
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నూనె చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మెరిసే చర్మం కోసం: రాత్రి పడుకునే ముందు ముఖానికి, చేతులకు, కాళ్ళకు కొద్దిగా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. ఇది పొడి చర్మాన్ని దూరం చేసి, చర్మానికి మెరుపును ఇస్తుంది.
Also Read: Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బిగ్ షాక్!
జుట్టుకు లాభాలు: జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. దీనివల్ల జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు సరైన తేమ అంది చుండ్రు (Dandruff) సమస్య తగ్గుతుంది. అంతేకాక ఇది జుట్టు రాలడాన్ని (Hair Fall) కూడా తగ్గిస్తుంది.
పెదాల పగుళ్లు దూరం
మీరు పెదాల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే కొబ్బరి నూనె ఒక అద్భుతమైన పరిష్కారం. పగిలిన పెదాలు లేదా పగిలిన మడమల పొడితనాన్ని కొబ్బరి నూనె దూరం చేయగలదు. దీని కోసం రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెను పగిలిన ప్రాంతంలో రాయండి. ఇది రాత్రంతా పెదాలు, మడమలలో తేమను నిలుపుకొని, వాటిని మృదువుగా ఉంచుతుంది.
మంచి నిద్ర కోసం
రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి (Relax) లభించడమే కాకుండా ఒత్తిడి (Stress) కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తల లేదా పాదాలకు నూనె రాసుకుని పడుకుంటే మనస్సు శాంతించి, మంచి నిద్ర (Sound Sleep) పడుతుంది.
