Strong Test: శరీరం బలంగా ఉంటే మనిషి త్వరగా అలసిపోడు, ఎముకల నొప్పులు ఉండవు. బరువులు ఎత్తడంలో ఇబ్బంది కలగదు. చిన్నపాటి దెబ్బలకు విలవిలలాడడు. అయితే, చాలామంది తమ శరీరం బలంగా ఉందని అనుకుంటారు, కానీ పరీక్షించి చూస్తే శరీరంలో సత్తువ లేదని అర్థమవుతుంది. అందుకే మీరు నిజంగా స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి వైద్యులు సూచించిన ఈ 20 సెకన్ల టెస్ట్ చేసి చూడండి.
మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?
ఈ సింపుల్ టెస్ట్ చేయడానికి మీకు ఒక కుర్చీ అవసరం. కుర్చీపై కూర్చుని ఆపై లేవాలి. మళ్ళీ కూర్చోవాలి. అయితే ఇలా లేచేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు మీ చేతులను కుర్చీకి గానీ, మోకాళ్లకు గానీ ఆనించకూడదు.
Also Read: మొహమ్మద్ రిజ్వాన్‌కు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర అవమానం!
ఈ పరీక్ష ఫలితాలు ఇలా ఉంటాయి
20 సెకన్లు: మీరు 20 సెకన్ల పాటు నిరంతరం ఇలా చేయగలిగితే మీ ఫిట్‌నెస్ లెవల్ ‘ఎక్సలెంట్’ (చాలా బాగుంది) అని అర్థం.
15 నుండి 19 సెకన్లు: మీ ఫిట్‌నెస్ ‘మంచి’ స్థితిలో ఉన్నట్లు.
10 నుండి 14 సెకన్లు: మీ శారీరక బలం ‘యావరేజ్’గా ఉన్నట్లు.
10 సెకన్ల కంటే తక్కువ: మీరు ఇలా 10 సెకన్లు కూడా చేయలేకపోతే మీ శరీరం బలహీనంగా ఉందని అర్థం.
శారీరక బలాన్ని పెంచే ఆహారాలు
శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి మీ డైట్‌లో ఈ క్రింది ఆహారాలను చేర్చుకోండి.
గుడ్లు: శరీర బలానికి గుడ్డు ఉత్తమమైనది. ఇందులో హై-ప్రోటీన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర స్టామినాను, శక్తిని పెంచుతాయి.
ఆకుకూరలు: మీ భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. వీటిలో కొవ్వు తక్కువగా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్టామినా పెరగడానికి సహాయపడుతుంది.
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్ (అక్రోట్), జీడిపప్పు వంటివి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. స్ట్రెంత్‌ను బూస్ట్ చేస్తాయి.
చేపలు: చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, పుష్కలమైన ఎనర్జీ లభిస్తుంది.
గుమ్మడి గింజలు: వీటిలో ప్రోటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కండరాల పుష్టికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.
