Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు తగ్గాలంటే ఈ పండును తినాల్సిందే?

మామూలుగా ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలకు వాంతులు రావడం అన్నది సహజం. చాలామందికి మొదటి రెండవ నెల నుంచి ఈ వాంతులు అవడం ప్రారంభిస్తూ ఉం

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 07:50 PM IST

మామూలుగా ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలకు వాంతులు రావడం అన్నది సహజం. చాలామందికి మొదటి రెండవ నెల నుంచి ఈ వాంతులు అవడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఏది తిన్నా కూడా వికారంగా వాంతులు వచ్చేలా అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ సమయంలో ఎంత తిన్నా కూడా తొందరగా అలసిపోవడంతో పాటు శక్తి కూడా క్షీణిస్తుంది. అయితే ఎక్కువగా ఇది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ సమయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని పండ్లు తినడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు వైద్యులు. అయితే ముందుగా వికార సమస్యని తగ్గించేందుకు కచ్చితంగా నీరు తాగడం చాలా మంచిది.

ఎందుకంటే వాంతులు చేసుకోవడం వల్ల చాలా మంది డీహైడ్రేట్ అయిపోతారు. అందుకే, మీరు తాగడం అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్‌గా నీరు తాగితే అవసరమైన ఖనిజాలు, లవణాలు అందుతాయి. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. అదేవిదంగా అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వాంతులను తగ్గించేందుకు అల్లం బాగా పనిచేస్తుంది. అల్లంని తీసుకుంటే మీ జీర్ణక్రియ మెరుగ్గా మారి కడుపులో ఆమ్లతను తగ్గిస్తుంది. కాబట్టి అల్లం టీ తాగడం లేదంటే మీ డైట్‌లో అల్లంని చేర్చుకోవడం మంచిది. నారింజపండు తీసుకోవడం వల్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది. నారింజలో సిట్రిక్ యాసిడ్ ఉంది. మీరు తాజా నారింజ పండు వాసన చూసినా చాలా వరకూ సమస్య తగ్గుతుంది.

కాబట్టి, ప్రెగ్నెన్సీ సమయంలో ఈ మీరు నారింజల వాసన చూసినా, ఈ రసం తాగినా సమస్య తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో నిమ్మరసం చాలా మంచిది. ఇది మీ పిండానికి ఎలాంటి హాని కలిగించదు. దీనిలోని సిట్రస్ కారణంగా వికారం సమస్య నుండి బయటపడొచ్చు. నిమ్మకాయలో మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకోసం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగొచ్చు. అలాగే నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వికార సమస్యని తగ్గించడంలో కివీ పండు కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పండు రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కివి పండులో ఫోలేట్, పొటాషియం, విటమిన్లు సి, కె, ఇలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల హైడ్రేట్ అవుతారు.