Site icon HashtagU Telugu

Sweating: చంకల్లో వచ్చే విపరీతమైన చెమట కారణంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Sweating

Sweating

మామూలుగా వేసవికాలం వచ్చింది అంటే చాలు శరీరం మొత్తం విపరీతంగా చెమట కాడుతూ ఉంటుంది. తల వెంట్రుకల నుంచి అరికాలు వరకు విపరీతమైన చెమట వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చంకల ప్రాంతంలో విపరీతమైన చెమట వస్తుంది. ఈ సంకల్లో వచ్చే చెమట కారణంగా చాలా మంది తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చెమట కారణంగా నలుగురికి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఆఫీసులకు వెళ్లే వారికి ఇది చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. దీని వల్ల బట్టలు మొత్తం నాని పోతూ ఉంటాయి. అయితే ఇలాంటిప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే చెమట పట్టకుండా ఉంటుందని చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాలాలతో సంబంధం లేకుండా కొంతమంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. ఎండ కాలంలో కూడా వేడి నీటి స్నానం చేస్తుంటారు. చన్నీటి స్నానం అయినా, వేడినీటి స్నానం అయినా ఎండా కాలంలో చంకల్లో చెమట పట్టకూడదంటే మాత్రం స్నానం చేసిన వెంటనే దుస్తులను వేసుకోకూడదట. శరీరం పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల చెమట పట్టే అవకాశం తగ్గుతుందట. అలాగే చంకల్లో హెయిర్ ఎక్కువగా ఉంటే కూడా బాగా చెమట పట్టడంతో పాటుగా దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంటుందట. అందుకే ఈ హెయిర్ ను ఎక్కువగా ఉంచకూడదట. ఇలా చేస్తేనే చంకల్లో నుంచి దుర్వాసన రాదట. చెమట కూడా ఎక్కువగా పట్టదని చెబుతున్నారు.

మీరు హైపర్ హైడ్రోసిస్ తో బాధపడుతుంటే మాత్రం వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొవ్వు పదార్థాలు, వేడి, కారంగా ఉండే ఆహారాలను తినడం మానుకోవాలట. వీటిని మానేస్తేనే మీకు చెమట కూడా తక్కువగా పడుతుందని చెబుతున్నారు. ఒంటి దుర్వాసన కూడా తగ్గుతుందట. ఎండా కాలంలో బయటకు వెళ్లినప్పుడు చంకల్లో చెమటలు పట్టడం చాలా కామన్ అని చెబుతున్నారు. ఈ సీజన్ లో శరీరం లోని నీరు మొత్తం చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంటుందట. అందుకే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం కోసం నీళ్లను బాగా తాగడంతో పాటుగా ద్రాక్ష, కాకరకాయ, బ్రోకలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, చిలగడదుంప, ఆలివ్ ఆయిల్ ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి పండ్లను తినాలట. దీంతో అండర్ ఆర్మ్ చెమట తగ్గుతుందట.

చంక బిగుసుకుపోయే దుస్తులు లను ధరించడం వల్ల చంకల్లో చెమటలు బాగా పడతాయట. అందుకే వదులుగా గాలి తగిలే దుస్తులను ధరించాలట. దీనివల్ల చంకల్లో చెమటలు పట్టే అవకాశం చాలా వరకు తగ్గుతుందట. ఎండా కాలంలో నీళ్లను బాగా తాగాలట. ఎందుకంటే ఎండల వల్ల శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకుపోతుందట. దీంతో బాడీ డీహైడ్రేట్ అవుతుందట. అందుకే ఈ కాలంలో నీళ్లను పుష్కలంగా తాగాలట. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉణ్న ఆహారాలను కూడా తినాలట. దీనివల్ల మీ శరీరం చల్లగా ఉంటుందట,చంకల్లో చెమట కూడా పట్టదని చెబుతున్నారు. సిగరెట్లలోని నికోటిన్, కెఫిన్ లు ఎక్కువగా ఉంటాయట. ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను బాగా పెంచుతాయట. అలాగే గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తాయట. అంతేకాదు చెమట గ్రంథులు ఎక్కువ చెమట పట్టేలా చేస్తాయని చెబుతున్నారు. అందుకే మీరు సిగరెట్ మానేయడం వల్ల చంకల్లో చెమట తగ్గుతుందట. .